ఐటం సాంగ్ లేకుండా టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ సినిమా ఉండదు. ఆయన ప్రతీ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే.ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ తో తెరకెక్కించిన పుష్ప సినిమాలోని ఐటమ్ సాంగ్ మూవీకి ఎంత క్రేజ్ తీసుకొచ్చిందో అందికి తెలిసిందే. స్టార్ హీరోయిన్ సమంత రుతు ప్రభుతో ‘ఉ అంటావా మావా.. ఉఊ అంటావా’ అంటూ వచ్చిన ఐటం సాంగ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ సాంగ్ దేశవ్యాప్తంగా అందరినీ ఓ ఊపు ఊపేసింది. దీంతో మేకర్స్ అసలు ప్రమోషన్స్ చేయకపోయినా హిందీ డబ్బింగ్ వర్షన్ ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఇప్పుడు ‘పుష్ప 2: ది రూల్’ మూవీలో కూడా ఓ స్పెషల్ సాంగ్ ను సుకుమార్ ప్లాన్ చేశారు. ఈ సాంగ్ ను స్టార్ హీరోయిన్ తో చేయించేందుకు మేకర్స్ నిర్ణయించకున్నారట. ఇందులో భాగంగా బాలీవుడ్ హీరోయిన్ తో ఐటం సాంగ్ చేయించాలని ప్రయత్నాలు జరిగాయి.ఈ క్రమంలో ‘యానిమల్’ మూవీతో నేషనల్ క్రష్ గా మారిన హాట్ బ్యూటీ త్రుప్తి డిమ్రితో ఐటం సాంగ్ చేయించేందుకు ప్రయత్నించారు. అయితే ఈ ఆఫర్ ని ఆమె రిజెక్ట్ చేసింది.. ఆ తర్వాత ‘స్త్రీ 2’ మూవీతో బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ గా మారిన శ్రద్ధా కపూర్ తో ఐటం సాంగ్ చేయించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. 4 నిమిషాల ఐటం సాంగ్ డ్యాన్స్ చేసేందుకు రూ.10 కోట్లు డిమాండ్ చేసిందట. దీంతో మేకర్స్ వద్దనుకున్నారట.
ఇలా బాలీవుడ్ భామలు సైడైపోవడంతో.. చివరికి టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలతో స్పెషల్ సాంగ్ చేయించాలని డిసైడ్ అయ్యారట చిత్రయూనిట్. దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే, ఈ వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకవేళ శ్రీలీల, అల్లుఅర్జున్ కలిసి స్టెప్పులేస్తే థియేటర్లు ఊగిపోవాల్సిందే అంటున్నారు నెటిజెన్స్.