Sivakarthikeyan: యంగ్ హీరోయిన్ శ్రీలీల వరుస సినిమాలతో బిజీగా ఉంది. పరాశక్తి చిత్రంతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. ఇప్పుడు మరో ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పింది. శివకార్తికేయన్‌తో రెండోసారి జతకడుతోంది. శ్రీలీల వరుసబెట్టి సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అంతగా దక్కడం లేదు. ప్రస్తుతం శివకార్తికేయన్ సరసన ‘పరాశక్తి’తో తమిళ సినీ పరిశ్రమలో అడుగుపెడుతోంది. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌కు ముందే శ్రీలీల మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు సైన్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. తన తదుపరి చిత్రంలో కూడా శివకార్తికేయన్‌తో జోడీ కట్టనుంది. ఈ ఇద్దరినీ మళ్లీ తెరపై చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సిబి చక్రవర్తి దర్శకత్వంలో రూపొందనున్న ఈ కొత్త చిత్రం షూటింగ్ డిసెంబర్ 10 నుంచి ప్రారంభం కానుంది. గతంలో సిబి చక్రవర్తి-శివకార్తికేయన్ కాంబినేషన్లో వచ్చిన ‘డాన్’ పెద్ద హిట్ కావడంతో ఈ కొత్త చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీలీల హీరోయిన్గా ఫిక్స్ అయిందా అనే విషయంపై నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

