Sreeleela

Sreeleela: ఇంకెక్కడి లవ్.. మా అమ్మ నాతోనే ఉంటుంది : శ్రీలీల కీలక కామెంట్స్

Sreeleela: తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా దూసుకుపోతుంది శ్రీలీల. తాజాగా ఆమె తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి ప్రణాళికల గురించి మాట్లాడారు. శ్రీలీల ప్రస్తుతం తన వయసు 23 సంవత్సరాలు అని, కనీసం 30 ఏళ్లు వచ్చే వరకు పెళ్లి గురించి ఆలోచించనని స్పష్టం చేశారు. ఆమె ప్రధానంగా తన కెరీర్‌పైనే పూర్తి దృష్టి సారించాలని నిర్ణయించుకున్నారు. శ్రీలీల తన కుటుంబానికి ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తారు. తన తల్లిదండ్రులకు ఇల్లు కట్టించి ఇచ్చే వరకు పెళ్లి చేసుకోనని ఆమె గతంలోనే తెలిపారు.

బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్‌తో ప్రేమలో ఉన్నారంటూ వస్తున్న వార్తలపై కూడా శ్రీలీల స్పందించారు. “నేను ప్రేమలో ఉన్నానని అందరూ అనుకుంటున్నారు. కానీ నాకు ఆ ఛాన్సే లేదు. నేను ఎక్కడికి వెళ్లినా మా అమ్మ నాతోనే ఉంటుంది. నేను వెకేషన్‌కు వెళ్లినా అమ్మ పక్కనే ఉంటుంది. అలాంటప్పుడు నేను ఎలా ప్రేమలో ఉంటాను?” అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

ఇది కూడా చదవండి: AA22: కుర్రాడితో అల్లు అర్జున్ – అట్లీ మాస్ మ్యాజిక్ స్టార్ట్!

కొన్ని రోజుల క్రితం ఆమె పెళ్లి కూతురిలా రెడీ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, దీంతో పెళ్లి అంటూ పుకార్లు వ్యాపించాయి. అయితే, అవి తన పుట్టినరోజుకు ముందు జరిగిన ప్రీ-బర్త్‌డే వేడుకలకు సంబంధించినవని, కుటుంబ సంప్రదాయం ప్రకారం పసుపు వేడుక జరిగిందని ఆమె క్లారిటీ ఇచ్చారు. మొత్తంగా, శ్రీలీల ప్రస్తుతం తన కెరీర్‌పైనే దృష్టి పెట్టారని, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉందని ఆమె మాటల ద్వారా స్పష్టమవుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Devil’s Astrologer: నేపాల్ రాజకీయ పరిణామాలను 2 ఏళ్ల క్రితమే ఊహించిన జ్యోతిష్కుడు.. ఏమి చెప్పాడంటే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *