Single: టాలీవుడ్ యంగ్ టాలెంట్ శ్రీవిష్ణు మరోసారి తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తాజాగా విడుదలైన ‘సింగిల్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తీక్ రాజు తెరకెక్కించారు. రిలీజ్ రోజు నుంచే సాలిడ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ, శ్రీవిష్ణు కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
వీక్ డేస్‌లోనూ వసూళ్లలో తగ్గేది లేకుండా దూసుకెళ్తున్న ‘సింగిల్’, యూఎస్ మార్కెట్‌లోనూ అదరగొడుతోంది. హాఫ్ మిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకుని సరికొత్త రికార్డ్ సృష్టించింది. కంటెంట్, కామెడీ కలగలిపిన ఈ చిత్రం యువతను ఎంతగానో ఆకర్షిస్తోంది. శ్రీవిష్ణు యాక్టింగ్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఈ సినిమా విజయంతో శ్రీవిష్ణు తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ‘సింగిల్’ ఇప్పుడు బాక్సాఫీస్‌ను రూల్ చేస్తూ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది!
#𝐒𝐈𝐍𝐆𝐋𝐄 𝐬𝐦𝐚𝐬𝐡𝐞𝐬 𝐩𝐚𝐬𝐭 $𝟓𝟎𝟎𝐊 𝐚𝐭 𝐭𝐡𝐞 𝐔𝐒𝐀 𝐁𝐨𝐱 𝐎𝐟𝐟𝐢𝐜𝐞🇺🇸❤️🔥
Unstoppable craze, roaring crowds and packed theatres coast to coast🔥
The Blockbuster Rampage is only getting bigger & bigger🤩
Grand USA Release By @VcinemasUS
#SingleMovie… pic.twitter.com/nuUohvaJiw
— V Cinemas (@VcinemasUS) May 14, 2025