Single

Single: ‘సింగిల్’ సంచలనం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న శ్రీవిష్ణు!

Single: శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ‘సింగిల్’ బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టిస్తోంది. పాజిటివ్ టాక్‌తో ఈ చిత్రం రోజురోజుకూ భారీ వసూళ్లు రాబడుతోంది. మూడో రోజు అద్భుతమైన ప్రదర్శనతో కలెక్షన్స్‌లో ఊపు చూపిన ఈ సినిమా, వారం ప్రారంభంలోనూ జోరు కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ. 16.3 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం, ఆదివారం ఒక్కరోజే రూ. 5.1 కోట్లు రాబట్టింది. బుక్‌మైషోలో 24 గంటల్లో 66 వేల టిక్కెట్లు అమ్ముడుపోగా, మొత్తం టిక్కెట్ల సంఖ్య 2 లక్షలు దాటింది. అమెరికాలో $400K మార్క్‌ను అధిగమించిన ‘సింగిల్’, అర మిలియన్ డాలర్ల వైపు దూసుకెళ్తోంది. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. మరిన్ని వసూళ్లతో ఈ వీకెండ్‌లోనూ ‘సింగిల్’ సందడి చేయనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Gadchiroli Encounter: గడ్చిరోలి జిల్లాలో ఎన్‌కౌంటర్ .. నలుగురు మావోయిస్టులు మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *