Spying For Pakistan: భారత్, పాక్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మరో ఆందోళన కలిగించే అంశం బయటకొచ్చింది. పాకిస్థాన్‌లో గూఢచారిగా పనిచేస్తున్న మన దేశ విద్యార్థి విషయం వెలుగులోకి వచ్చింది. సరిహద్దు ప్రాంతంలోని హర్యానాకు చెందిన ఆ విద్యార్థి భారతదేశ సైనిక స్థావరాలను, ఇతర రహస్యాలను పాక్ సైన్యానికి అందజేసినట్టు వెల్లడి కావడంతో అతడిని అరెస్టు చేశారు.
Spying For Pakistan: హర్యానా రాష్ట్రం పాటియాలలో విద్యార్థి దేవేంద్రసింగ్ (25) పొలిటికల్ సైన్స్ ఫస్టియర్ చదువుతున్నాడు. 2024లో కర్తార్‌పూర్ కారిడార్ ద్వారా పాకిస్థాన్ దేశంలోకి వెళ్లాడు. అక్కడ ఐఎస్ఐ నిఘా అధికారిని కలిశాడన్న ఆరోపణలు వచ్చాయి. అయితే దేవేంద్రసింగ్ ఫేస్‌బుక్‌లో గన్, ఫిస్టల్ ఫొటోలను పోస్టు చేయడంతో పోలీసులు అతనిపై నిఘా పెట్టారు.
Spying For Pakistan: పోలీసుల నిఘాలో ఆశ్చర్యపోయే చేదు నిజాలు బయటకొచ్చాయి. పాకిస్థాన్‌కు వెళ్లిన సమయంలో దేవేంద్రసింగ్‌ను హనీట్రాప్ ద్వారా పాకిస్థాన్ ఐఎస్ఐ తన గుప్పిట్లో పెట్టుకున్నదని తేలింది. ఈ సమయంలో అతని నుంచి ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సైనిక స్థావరాల వివరాలు, ఇతర రహస్యాలను దేవేంద్రసింగ్ పాకిస్థాన్‌కు అందించినట్టు పోలీసులు పేర్కొన్నారు.