Spirit

Spirit: స్పిరిట్‌తో రెబల్ రచ్చ.. వంగ మాయాజాలం రెడీ!

Spirit: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్! సందీప్ వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమా నవంబర్ నుంచి సెట్స్‌పైకి వెళ్తోంది. ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ రోల్‌లో ప్రభాస్ కనిపించనున్నాడు. త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమాపై అంచనాలు ఆకాశమంత ఎత్తులో ఉన్నాయి.

Also Read: Pawan Kalyan: ఓజీ ఆ రోజు నుంచే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి

ప్రభాస్, సందీప్ వంగ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘స్పిరిట్’ సినిమా రెబల్ ఫ్యాన్స్‌లో జోష్ నింపుతోంది. రెండేళ్ల క్రితం అనౌన్స్ అయిన ఈ చిత్రం నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి షూటింగ్ ప్రారంభించనుంది. సందీప్ వంగ ప్రీ-ప్రొడక్షన్‌లో ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ, షూటింగ్ మొదలైతే ఆరు నెలల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ రోల్‌లో కనిపించనుండగా, సౌత్ కొరియన్ యాక్టర్ డాంగ్ లీ విలన్‌గా నటించనున్నట్లు సమాచారం. త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా ఫిక్స్ కాగా, తరుణ్, శ్రీకాంత్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారని టాక్. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ఇప్పటికే పూర్తయ్యాయి. సందీప్ వంగ తన స్టైల్‌లో ప్రభాస్‌ను సరికొత్త అవతారంలో చూపించేందుకు పక్కా ప్లానింగ్ లో ఉన్నాడట. ప్రభాస్ ఇప్పటికే వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, ‘స్పిరిట్’ను పాన్ వరల్డ్ యాక్షన్ మూవీగా తీర్చిదిద్దుతున్నాడు సందీప్. 2026 సెకండ్ హాఫ్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *