Spirit: ప్రభాస్ 25వ సినిమా ‘స్పిరిట్’ కోసం టీమ్ పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ డైనమిక్ కాప్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే సందీప్, మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రమేశ్వర్ కలిసి సినిమా పాటల కంపోజింగ్ పూర్తి చేశారు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’లో హర్షవర్ధన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఇప్పుడు ‘స్పిరిట్’ కోసం కూడా ఎమోషనల్ బీజీఎంతో ఆకట్టుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం లిరిక్స్, వోకల్స్ పనులు జరుగుతున్నాయి.
Also Read: Kanchana 4: కాంచన 4 షూటింగ్ అప్డేట్.. పూజా హెగ్డే సరికొత్త అవతారం!
సెప్టెంబర్ రెండో వారం నుంచి హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత యూరప్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ప్రభాస్ లుక్ కోసం స్పెషల్ టెస్ట్‌లు కూడా పూర్తయ్యాయి. సినిమా కథ పోలీస్ కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుందని, ప్రభాస్ నటన కొత్త ఒరవడిని సృష్టిస్తుందని టీమ్ ధీమాగా ఉంది. ఈ మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ 2026లో విడుదలకు సిద్ధమవుతోంది.