TS News: తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు తిరిగింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధికారికంగా విచారణను ప్రారంభించారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయా ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు.
కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల జాబితాలో సంజయ్, పోచారం శ్రీనివాస రెడ్డి, తెల్లం వెంకట్‌రావు, కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి పేర్లు ఉన్నాయి. వీరంతా పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని బీఆర్ఎస్ అగ్రనేతలు అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.
ఇది కూడా చదవండి: Sai Dharam Tej: మన జీవితానికి మనదే బాధ్యత.. హెల్మెట్టే నా ప్రాణాలను కాపాడింది
నోటీసుల్లో ఈ ఎమ్మెల్యేల పార్టీ మార్పు నిరూపించేందుకు బీఆర్ఎస్ నాయకులు మరిన్ని ఆధారాలను సమర్పించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పష్టం చేశారు. దీంతో ఫిరాయింపుల కేసు విచారణకు అధికారికంగా శ్రీకారం చుట్టినట్లు అయింది.
ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. స్పీకర్ నిర్ణయం తదుపరి రోజుల్లో రాష్ట్ర రాజకీయాలపై కీలక ప్రభావం చూపనుంది.