Space tour:అంతరిక్షయానం చేసిన తొలి భారతీయురాలిగా మనం ఇన్నాళ్లు కల్పనా చావ్లాగా చదువుకుంటాం. కానీ భారత సంతతికి చెందిన అమెరికా జాతీయురాలు అయిన కల్పనా చావ్లా నాసా వ్యోమగామిగా అంతరిక్షయానం చేశారు. దీంతో ఆమెను తొలి భారతీయురాలిగా మనం గర్వంగా చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే భారత్‌లో జన్మించి, ఇక్కడే నివసిస్తూ, భారత జాతీయత కలిగిన మహిళగా ఓ యువతి రికార్డు సృష్టించింది. ఆమే జాహ్నవి దంగేటి. ఆమె మన తెలుగింటి బిడ్డ కావడం మరింత గర్వకారణం.
Space tour:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాలకొల్లు అనే పట్టణానికి చెందిన జాహ్నవి దంగేటి టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ ద్వారా అంతరిక్ష యానానికి ఎంపికైంది. ఆమె 2029 మార్చి నెలలో టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ నిర్వహించనున్న మొదటి అంతరిక్ష మిషన్‌లో ఆమె ప్రయాణిస్తారు. జాహ్నవి దంగేటి 11 ఏళ్ల వయసులోనే నాసా గురించిన సమాచారాన్ని పూర్తిగా తెలుసుకున్నారు.
Space tour:జాహ్నవి దంగేటి అమ్మమ్మ నిద్రవేళ చెప్పిన కథలు ఆమె ఊహలను నిజంగా కదిలించాయని సమాచారం. ఆమె నాసా ఇంటర్నేషన్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ (ఐఏఎస్‌పీ) పూర్తి చేసిన తొలి భారతీయ మహిళ కూడా కావడం విశేషం. జాహ్నవి ఘనత గురించి తెలిసిన తెలుగు ప్రజలే కాదు.. దేశవ్యాప్తంగా ఎందరో ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. ఆమె కృషికి జేజేలు పలుకుతున్నారు.