Action King Arjun: యాక్షన్ కింగ్ అర్జున్ తన జీవితాన్ని సినిమాలకు అంకితం చేసిన వ్యక్తి. యుక్తవయసులోనే చిత్రసీమలోకి అడుగుపెట్టి, పలు చిత్రాలలో నటించాడు. ఆపైన నిర్మాత, దర్శకుడిగానూ పేరు తెచ్చుకున్నాడు. దేశభక్తిని ప్రేరేపించే చిత్రాలను రూపొందించిన అర్జున్… హనుమంతుడికి పరమ భక్తుడు కూడా. ఆయనకోసం ఓ పెద్ద గుడిని కట్టించాడు. అలానే తన కుమార్తెనూ చిత్రసీమలోకి ఆహ్వానించాడు. ఆమె నాయికగాఓ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇలా చిత్రసీమకు అంకితమైన అర్జున్ సర్జా ను ఎంజీఆర్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ తో ఇటీవల సత్కరించింది. ఈ కార్యక్రమంలో అర్జున్ ను యూనివర్సిటీ ప్రొఫెనర్స్ ఘనంగా సన్మానించారు.

