South Central Railway: వరుస పండుగల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్తను అందించింది. దసరా, దీపావళి, ఛట్ పండుగల సందర్భంగా అదనంగా ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు 22 ప్రత్యేక రైళ్లను ఆయా పండుగల సందర్భంగా నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
South Central Railway: సెప్టెంబర్ 4వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సికింద్రాబాద్-తిరుపతి మధ్య నాలుగు, కాచిగూడ-నాగర్‌సోల్ మధ్య నాలుగు, అదే విధంగా సెప్టెంబర్ 5 నుంచి 26వ తేదీ వరకు తిరుపతి-సికింద్రాబాద్ మధ్య నాలుగు, నాగర్ సోల్-కాచిగూడ మధ్య నాలుగు సర్వీసులు చొప్పున ప్రత్యేక రైళ్లు నడుస్తాయని రైల్వే అధికారులు తెలిపారు.
South Central Railway: సెప్టెంబర్ 19వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు సంత్రాంగ్జి-చర్లపల్లి మధ్య 3, సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ నాలుగు వరకు చర్లపల్లి-సంత్రాగ్జి మధ్య మూడు ప్రత్యేక రైల్వే సర్వీసులను అందుబాటులో ఉంచుతామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. దీంతో ఆయా రైల్వే లైన్లలో ప్రయాణించే ప్రయాణికులకు, పండుగలకు వెళ్లాల్సిన, తిరుగు ప్రయాణం చేయాల్సిన వారికి సౌకర్యంగా ఉంటుంది.