South America Earthquake: దక్షిణ అమెరికాలోని డ్రేక్ పాసేజ్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, ఈ భూకంపం తీవ్రత తొలుత 8.0గా నమోదైంది. అయితే, తరువాత దానిని 7.5కి సవరించారు. కొన్ని ఇతర సంస్థలు దీనిని 7.1 లేదా 7.4గా కూడా నమోదు చేశాయి. భూకంప కేంద్రం (ఎపిసెంటర్) దక్షిణ అమెరికా, అంటార్కిటికా మధ్య ఉన్న డ్రేక్ పాసేజ్ సముద్ర ప్రాంతంలో ఉంది.
ఇది అర్జెంటీనాలోని ఉషుయా నగరానికి ఆగ్నేయంగా దాదాపు 707 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూకంపం సంభవించిన వెంటనే చిలీ ప్రభుత్వం తన అంటార్కిటిక్ భూభాగాల కోసం సునామీ హెచ్చరికలను జారీ చేసింది. అయితే, పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ , హవాయి లేదా ఇతర దూర ప్రాంతాలకు ఎటువంటి సునామీ ప్రమాదం లేదని స్పష్టం చేసింది. ఈ ప్రాంతం చాలా రిమోట్‌గా, జనసంచారం లేని ప్రాంతంలో ఉండటం వల్ల ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు లేవు.
ఇది కూడా చదవండి: Supreme Court: వీధి కుక్కల తరలింపుపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
కాగా అంతకుముందు ఆగస్టు 17న ఇండోనేషియా తూర్పు భాగంలో 5.8 తీవ్రతతో సముద్రగర్భంలో భూకంపం సంభవించింది. ఇందులో 29 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సెంట్రల్ సులవేసి ప్రావిన్స్‌లోని పోసో జిల్లాకు ఉత్తరాన 15 కిలోమీటర్లు (9.3 మైళ్ళు) దూరంలో భూకంపం సంభవించిందని., ఆ తర్వాత కనీసం 15 సార్లు ప్రకంపనలు సంభవించాయని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఇప్పడు అదే ప్రభావం అమెరికాలో డ్రేక్ ప్యాసేజ్ మీద కూడా పడిందని అంటున్నారు. ఇక్కడ కూడా సముద్రం లోపలే ముందు భూమి కంపిందని అంటున్నారు.