Australia: డిఫెండింగ్ ప్రపంచ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాకు స్వదేశంలో అవమానకరమైన సిరీస్ ఓటమిని చవిచూసింది. దక్షిణాఫ్రికా జట్టు వరుసగా రెండో వన్డే మ్యాచ్‌లో కంగారూలను ఓడించి, సిరీస్‌ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. దీనితో ఆస్ట్రేలియాపై వరుసగా 5వ వన్డే సిరీస్‌ను దక్షిణాఫ్రికా గెలుచుకుంది. 2008 నుండి ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన 4 వన్డే సిరీస్‌లలో దక్షిణాఫ్రికా 3 సార్లు సిరీస్‌ను గెలుచుకుంది. శుక్రవారం జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 84 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆఫ్రికా 2-0తో గెలుచుకుంది. రెండో వన్డేలో దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసి 49.1 ఓవర్లలో 277 పరుగులు చేసింది. ఆఫ్రికా తరఫున మాథ్యూ బ్రిట్జ్కే 88 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు, ట్రిస్టన్ స్టబ్స్ 74 పరుగులు చేసి జట్టు పోటీ స్కోరును చేరుకోవడంలో సహాయపడ్డాడు.
ఆస్ట్రేలియా తరఫున ఆడమ్ జంపా 63 పరుగులకు 3, మార్నస్ లాబుస్చాగ్నే 29 పరుగులకు 2, నాథన్ ఎల్లిస్ 46 పరుగులకు 2, జేవియర్ బార్ట్‌లెట్ 45 పరుగులకు 2 వికెట్లు పడగొట్టారు.278 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా 37.4 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియాకు పేలవమైన ఆరంభం లభించింది. వారు కేవలం ఏడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయారు. ట్రావిస్ హెడ్ (6), మార్నస్ లాబుస్చాగ్నే (1) ఔటయ్యారు. కెప్టెన్ మిచెల్ మార్ష్ (18) రూపంలో ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. దీని తర్వాత, జోష్ ఇంగ్లిస్ , కామెరాన్ గ్రీన్ ఇన్నింగ్స్‌ను నియంత్రించడానికి ప్రయత్నించారు. నాల్గవ వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా వారు కోలుకోవడానికి ప్రయత్నించారు. 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా 37.4 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్ అయింది.
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియాకు పేలవమైన ఆరంభం లభించింది. వారు కేవలం ఏడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయారు. ట్రావిస్ హెడ్ (6), మార్నస్ లాబుస్చాగ్నే (1) ఔటయ్యారు. కెప్టెన్ మిచెల్ మార్ష్ (18) రూపంలో ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. దీని తర్వాత, జోష్ ఇంగ్లిస్, కామెరాన్ గ్రీన్ ఇన్నింగ్స్‌ను నియంత్రించడానికి ప్రయత్నించారు. నాల్గవ వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా వారు కోలుకోవడానికి ప్రయత్నించారు.ఆస్ట్రేలియా చివరి నాలుగు వికెట్లను కేవలం 18 పరుగులకే కోల్పోయింది.