కోహినూర్ పాల ఉత్పత్తి సంస్థపై SOT అధికారులు దాడులు చేశారు. నకిలీ పాలు, పన్నీరు, బట్టర్, పెరుగు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. నగర శివారు ప్రాంతంలోని కోహినూర్ సంస్థలో సోదాలు నిర్వహించారు. కోహినూర్ సంస్థ ముడి సరుకుల పాల ఉత్పత్తులను తయారు చేస్తుంది.
కోహినూర్ సంస్థలు అక్రమాలు కల్తీ జరుగుతుందని సమాచారం అందుకున్న SOT పోలీసులు దాడులు నిర్వహించారు. కెమికల్స్ తో కలాకండ్ స్వీట్స్ తయారు చేస్తున్నట్టు గుర్తించారు.పాల ఉత్పత్తి కోసం పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన ముడి సరుకు స్వాధీనం చేసుకున్నారు. 300 కిలోల పన్నీర్, మిల్క్ పౌడర్ స్వాధీనం చేసుకున్నారు. కోహినూర్ సంస్థ యజమాని గజేందర్ సింగ్ అరెస్టు చేశారు.