Sonam Bajwa: పంజాబీ, హిందీ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో గుర్తింపు తెచ్చుకున్న నటి సోనమ్ బజ్వా తన కెరీర్ ప్రారంభంలో ఇంటిమేట్, కిస్సింగ్ సీన్స్‌పై తీసుకున్న నిర్ణయాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తల్లిదండ్రుల కోసమే తాను అలాంటి సన్నివేశాలను తిరస్కరించానని, అయితే వారి నుంచి ఊహించని సలహా విని షాకయ్యానని తెలిపారు.
పేరెంట్స్ కోసం.. పెద్ద సినిమాలు మిస్!
కెరీర్ ఆరంభంలో తాను ముద్దు సన్నివేశాలు (కిస్ సీన్స్) ఉన్న పలు హిందీ సినిమాల్లో నటించే అవకాశాలను తిరస్కరించానని సోనమ్ బజ్వా వెల్లడించారు. “ఒకవేళ నేను అలాంటి సన్నివేశాల్లో నటిస్తే, పంజాబీ ప్రేక్షకులు నన్ను అంగీకరిస్తారా? సినిమాను కుటుంబంతో కలిసి చూసినప్పుడు అసౌకర్యంగా ఉంటుందేమో? ఇది కేవలం నటన మాత్రమే అని నా తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారా?” అనే సందేహాలు తన మనసులో తిరిగేవని ఆమె పేర్కొన్నారు. ఈ ఆలోచనల కారణంగానే బాలీవుడ్‌లో కొన్ని పెద్ద సినిమాలు (హిట్ ప్రాజెక్ట్‌లు) మిస్ అయ్యాయని ఆమె బాధపడ్డారు.
Also Read: Salar Re-Release: సలార్ గ్రాండ్ రీ-రిలీజ్!
తల్లిదండ్రుల షాకింగ్ సలహా:
ఒకసారి తనకున్న ఈ సందేహాలన్నింటినీ తన తల్లిదండ్రులకు చెప్పినప్పుడు, వారి స్పందన విని సోనమ్ ఆశ్చర్యపోయారు. “ఇది సినిమా కోసమే కదా అలా చేసేది. దాని వల్ల సమస్య ఏంటి? అదంతా నటనలో భాగమే, అన్నీ చేయాలి” అని వారు సలహా ఇచ్చారట. ఈ మాటలు విని సోనమ్ షాకై, “ఇంతకాలం ఈ ముఖ్యమైన విషయం గురించి వారిని ఎందుకు అడగలేదు?” అని తనలో తాను బాధపడినట్లు తెలిపారు.
తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఈ ప్రోత్సాహకరమైన స్పందనతో, భవిష్యత్తులో నటనకు సంబంధించి మరింత ఓపెన్‌గా ఉంటానని, ఇకపై సినిమాల్లో ఇంటిమేట్ సీన్స్ విషయంలో మొహమాటపడనని ఆమె చెప్పారు. సోనమ్ బజ్వా నటించిన రొమాంటిక్ డ్రామా ‘ఏక్ దివానీ కీ దివానియత్’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నారు.
తెలుగులో ‘ఆటాడుకుందాం రా’, ‘బాబు బంగారం’ (ఒక పాటలో) చిత్రాలతో సోనమ్ బజ్వా ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం ఆమె ‘హౌస్‌ఫుల్ 5’ వంటి హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.