Crime News

Crime News: సంగారెడ్డిలో విషాదం – ఆస్తి కోసం కన్నతల్లిని హత్య చేసిన కొడుకు

Crime News: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆస్తి కోసం జరిగిన వివాదం చివరకు తల్లిని బలి తీసుకుంది. మద్యం వ్యసనానికి లోనైన కార్తీక్ రెడ్డి (26) తన తల్లి రాధికతో ఆస్తి విషయంలో గొడవకు దిగాడు. ఆవేశంలో తల్లిపై కత్తితో దాడి చేశాడు. కుటుంబ సభ్యులు గాయపడిన రాధికను ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది.

Also Read: TGSRTC: టీజీఎస్ ఆర్టీసీ మరో ముందడుగు – ప్రతి బస్సులో డిజిటల్ టికెట్ సేవలు!

Crime News: ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు. రాధిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

తల్లి ప్రేమను మరచిపోయి, ఆస్తి కోసం కన్నతల్లినే హత్య చేసిన ఘటన అందరినీ తీవ్ర ఆవేదనకు గురిచేసింది. కుటుంబ కలహాలు ఈ స్థాయికి చేరుకోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *