Dead Body On Bicycle: తల్లంటే ఆ కొడుక్కి ప్రాణం. ఆమె ఆరోగ్యం కోసం ఎన్నో ఆసుపత్రులకు అతడే స్వయంగా సైకిల్ పై తీసుకెళ్ళేవాడు. అలానే ఈ సారి కూడా సమ్మెకు అనారోగ్యంగా ఉంది అని…తీసుకెళ్లాడు. కానీ ఆమె చనిపోయింది. చేతిలో డబ్బులు లేవు . చేసేది ఏమి లేక కన్న తల్లిని 18కిలోమీటర్లు సైకిల్ పైనే మృతదేహాన్ని తీసుకుని వచ్చాడు. పేదరికం ఎదురొచ్చి నిలబడ్డా…కన్న తల్లి మీద ఉన్న ప్రేమ ముందు ఆ పేదరికమే…మూసుకుని పక్కకు వెళ్ళిపోయింది …
తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లాలో ఒక హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. తిరునెల్వేలి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ 65 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందగా, ఆమె కొడుకు తన తల్లి మృతదేహాన్ని 18 కిలోమీటర్లు సైకిల్ మోసుకెళ్లిన ఘటన ప్రజల మనసులను ఎంతగానో కలచివేసింది.తల్లి శవాన్ని సైకిల్‌పై మోసుకెళ్తున్న ఆ దృశ్యాన్ని కొందరు స్థానికులు తమ సెల్‌ఫోన్‌ల ద్వారా ఫోటోలు, వీడియో తీశారు. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయటంతో అది వైరల్‌గా మారింది.
కొద్ది రోజుల క్రితం శివకామియమ్మాళ్ ఆరోగ్య పరిస్థితి బాగా విషమించింది. దాంతో ఆమెను తిరునల్వేలి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. కానీ, అదేది అర్థం చేసుకోలేని 40 ఏళ్ల బాలన్ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లి శివగామి మృతదేహాన్ని సైకిల్‌పై తీసుకెళ్లాడు. గత నాలుగేళ్లుగా ఏయే ప్రదేశాలకు తల్లిని తీసుకెళ్లేవాడో.. అలాగే, ఆమె మరణం తరువాత కూడా అతడు తల్లి శవాన్ని సైకిల్ పై జాగ్రత్తగా తీసుకెళ్లిన ఈ దృశ్యం ప్రజల హృదయాలను కలిచివేసింది. సైకిల్ తల్లి శవంతో అతడు సుమారు18 కిలో మీటర్ల దూరం ప్రయాణించాడు.
అయితే, శివగామి మృతదేహాన్ని గుడ్డతో కట్టి సైకిల్‌పై తీసుకెళ్లుతుండగా చూసిన వారు, ముండ్రడైపు పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు వెంటనే స్పందించి, బాలన్‌ను అదుపులోకి తీసుకొని శివగామి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం తిరునల్వేలి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.