Mlc Somu Veerruaju

Mlc Somu Veerruaju: వీర్రాజుకు ఎమ్మెల్సీ.. ఒక లాభం, ఒక నష్టం!

Mlc Somu Veerruaju: ఆ బీజేపీ నేతతో చంద్రబాబుకు అప్పుడు, ఇప్పుడూ తలనొప్పేనా? బాబు ఉదార మనస్థత్వం ఆ నేతకు మళ్లీ చట్ట సభల్లో అవకాశం దక్కేలా చేసింది. మరి ఇప్పటికైనా ఆ నేత తీరులో మార్పు వస్తుందా? గతంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీని విమర్శిస్తూ.. అధికార పక్షం అయిన వైసీపీ స్వరానికి నాద స్వరం ఊదిన ఆ పెద్ద మనిషి… ఇప్పుడు పెద్దల సభకు వెళ్లైనా.. వైసీపీ అక్రమాలపైనా, ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ తప్పులపైన గళం విప్పుతారా? లేక యథావిధిగా కూటమిలో కుంపట్లకు తెర తీస్తారా? ఇంతకీ ఎవరా బీజేపీ నేత? లెట్స్‌ వాచ్‌.

ఎమ్మెల్యేల కోటాలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం సులువుగా గెలుచుకోనున్న అన్ని సీట్లకూ అభ్యర్థులు ఖరారయ్యారు. కూటమి పెద్దన్న టీడీపీ మూడు స్థానాలతో సరిపెట్టుకోగా.. జనసేన, బీజేపీ చెరోటి పొందాయి. అయితే, ఇందులో బీజేపీ అనూహ్యంగా ఒక సీటును పొందడం గమనార్హం. ఆ పార్టీ తమ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, సీనియర్‌ నేత సోము వీర్రాజును ఖరారు చేయడం మరో విశేషం. ఏపీ బీజేపీ ఎమ్మెల్సీగా బాబు బద్ధ విరోధి సోము వీర్రాజును ఎంపిక చేయడం ద్వారా తెలుగు తమ్ముళ్లకు బీజేపీ ఒక రకంగా షాక్ ఇచ్చిందనే చెప్పాలి.

ఏపీ బీజేపీలో చంద్రబాబు అంటే ఒంటికాలిపై లేచే నేతగా సోము వీర్రాజు గుర్తింపు తెచ్చుకున్నారు. 2014-19 మధ్య ఏపీ ప్రభుత్వంలో బీజేపీ భాగం అయినప్పటికీ.. సోము తన వ్యతిరేకతను దాచుకోలేదని అంటారు. నాడు ఎన్డీయే నుండి టీడీపీ బయటకు వెళ్లిపోయేలా సోము వీర్రాజు తన వంతు పాత్ర పోషించారని చెబుతుంటారు. అంతెందుకు… గత ఐదేళ్ల వైసీపీ పాలన కాలంలో సోము వీర్రాజు ఒక టర్మ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు.

ఇది కూడా చదవండి: AP Politics: పిఠాపురం తమ్ముళ్లని రెచ్చగొట్టే పనిలో వైసీపీ

ఆ సమయంలో టీడీపీ, వైసీపీలకు బీజేపీ సమదూరం అంటూ ప్రకటనలిస్తూనే… అధికార పక్షమైన వైసీపీని తమలపాకుతో కొడితే.. ప్రతిపక్షమైన టీడీపీని తలుపు చెక్కతో కొట్టేవారు సోము వీర్రాజు. జగన్‌ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా దీక్షలు చేపట్టి.. విచిత్రంగా అక్కడా చంద్రబాబునే తిట్టేవారు. అయితే వైసీపీనే సోము వీర్రాజుతో మాట్లాడిస్తోందని.. జనాల్లో ఓ అభిప్రాయం రావడంతో చంద్రబాబుపై ఆయన విమర్శలు బూమరాంగ్‌ అయ్యాయి. అలా జగన్‌ ఏజెంటుగా విమర్శల పాలైనా సరే ఆయన ఎప్పుడూ తన పద్దతి మార్చుకోలేదు.

ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షురాలి పదవీ కాలం ముగియడంతో.. ఆమె స్థానంలో సోము వీర్రాజుని ఎక్కడ అధ్యక్షునిగా తీసుకొస్తారోనని టీడీపీ, జనసేన రెండు పార్టీల్లోనూ కంగారుంది. అయితే సోముకు ఎమ్మెల్సీ ఇవ్వడంతో.. ఆ ప్రమాదం తప్పినట్లే అని భావిస్తున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎమ్మెల్సీ పొందేందుకు బీజేపీకి సొంతంగా ఎమ్మెల్యేల బలం లేదు. కానీ పొత్తు ధర్మంలో భాగంగా బీజేపీకి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించారు సీఎం చంద్రబాబు. ఆ స్థానంలో వారు ఎవర్ని ఎమ్మెల్సీగా నిలబెట్టుకుంటారన్న అంశాన్ని కూడా బీజేపీ అంతర్గత వ్యవహారంగానే చూశారు. దానివల్లే సోము వీర్రాజుని ఎమ్మెల్సీ వరించింది. చంద్రబాబు ఉదార మనస్థత్వానికి ఇదో నిదర్శనం అంటున్నారు విశ్లేషకులు. మరి సోము వీర్రాజులో ఇక ముందైనా మార్పు వస్తుందో లేదో చూడాలి.

ALSO READ  Mahaa Vamsi: పవన్ సీన్ రిపీట్..గూబ పగిలిందా రాజా..

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *