Somireddy: 108 అంబులెన్సుల నిర్వహణలో అరబిందో భారీ కుంభకోణం. ఏ2 విజయసాయిరెడ్డి వియ్యంకుడి కంపెనీకి ప్రజల సొత్తు దోచిపెట్టిన జగన్ రెడ్డి.గోల్డెన్ అవర్ పాటించడంలోనూ అరబిందో విఫలం.గతంలోనే గోల్డెన్ అవర్ విషయం కాగ్ స్పష్టం చేసినా పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం.సకాలంలో ఆస్పత్రులకి చేర్చకుండా వందల మంది అమాయకుల ప్రాణాలు బలితీసుకున్న అరబిందో కంపెనీ యాజమాన్యంపై ఐపీసీ 302 సెక్షన్ కింద కేసులు నమోదు చేయాలి.అరబిందో కంపెనీ అరాచకాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా.తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
Somireddy: 108 అంబులెన్సుల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం తమకు రూ.141 కోట్లు చెల్లించాలని అరబిందో కంపెనీ చెబుతోంది.అరబిందో కంపెనీ ఏ2 విజయసాయిరెడ్డి వియ్యంకుడు రాంప్రసాద్ రెడ్డి, తన అల్లుడు రోహిత్ కు చెందినది.వైసీపీ ప్రభుత్వంలో 108 బాధ్యతలను చేజిక్కించుకున్న అరబిందో కంపెనీ వందల కోట్లు దోచుకుని ఎంతో మంది అమాయకుల ప్రాణాలు తీసింది.ప్రాణాపాయంలో ఉన్న వారిని సకాలంలో ఆస్పత్రులకు తరలించడంలో అరబిందో కంపెనీ విఫలమైందని, గోల్డెన్ అవర్ పాటించడంలో ఫెయిల్ అయిందని కాగ్ నివేదిక గతంలోనే స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: BR Naidu: టీటీడీ చైర్మన్ గా శ్రీ బి.ఆర్.నాయుడు ప్రమాణ స్వీకారం
Somireddy: 108 అంబులెన్సుల నిర్వహణలో అరబిందో కంపెనీ వైఫల్యాన్ని కాగ్ బట్టబయలు చేసిన తర్వాత అప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.గోల్డెన్ అవర్ పాటించకుండా అమాయకుల ప్రాణాలు బలితీసేందుకు 108 అంబులెన్సులు ఎందుకు వందల కోట్ల అక్రమ సంపాదన కోసం పేదల ప్రాణాలను బలితీసుకున్న అరంబిందో కంపెనీ యాజమాన్యంపై ఐపీసీ 302 సెక్షన్ కింద హత్య కేసు నమోదు చేయాలి పొరపాటున కత్తి తగిలి మనిషి ప్రాణాలు పోతే హత్య కేసు నమోదు చేసి జైలుకు పంపుతారు వందల మంది ప్రాణాలు బలితీసుకున్న అరబిందో కంపెనీపై చర్యలు తీసుకోకుండా ముందు అర్జెంటుగా రూ.141 కోట్లు చెల్లించాలంట 2011 నుంచి 2016 వరకు 108 అంబులెన్సుల నిర్వహణ బాధ్యతను జీవీకే సంస్థ సమర్ధవంతంగా నిర్వహించింది అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం 2016 నుంచి 2021 వరకు కూడా అదే సంస్థను పొడిగించింది వైసీపీ అధికారంలోకి రాగానే జీవీకే సంస్థతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని ఒక జీఓ ద్వారా బలవంతంగా రద్దు చేసింది.
Somireddy: జీవీకే సంస్థ చేసుకున్న ఒప్పందం ప్రకారం ఒక్కో అంబులెన్సకు నెలకు రూ.1.31 లక్షలు అయితే అరబిందో కంపెనీకి రూ.1.78 లక్షలు చెల్లించారు.కొత్త అంబులెన్సుకు అయితే నెలకు రూ.2.21 లక్షలకు పెంచారు.నిర్వహణ ఖర్చుల్లో చేసిన ఈ మార్పులతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ.800 కోట్లకు పైగా భారం పడింది.ఎవడబ్బ సొత్తు అని అరబిందో కంపెనీకి దోచిపెట్టారు.అరబిందో కంపెనీపై అంత ప్రేమ ఎందుకు. ఏ2 విజయసాయిరెడ్డి వియ్యకుండి కంపెనీకి ప్రజల సొత్తును దోచిపెట్టేందుకు ఆర్నెళ్లలో 6 జీఓలు ఇచ్చారు.హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ పర్యవేక్షణలో ఉన్న 108 అంబులెన్సులను ఆరోగ్య శ్రీ పరిధిలోకి మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది.రాజశేఖర్ రెడ్డి ఎవరని ప్రత్యేక జీఓ ద్వారా ఆరోగ్య శ్రీ డిప్యూటీ సీఈఓగా నియమించారు.
ఇది కూడా చదవండి: AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
Somireddy: మరో జీవోతో ఉద్యోగోన్నతి కల్పించారు.జగన్మోహన్ రెడ్డికి తోడుగా ఏ2 విజయసాయిరెడ్డి జైలులో ఉండి దోచుకోవడానికి సలహాలు చెప్పాడని, చెత్త భాషతో సోషల్ మీడియాలో విమర్శలు చేస్తాడని ప్రజల సొత్తు అప్పనంగా దోచిపెడతారా.విజయసాయి రెడ్డి వియ్యకుండి కంపెనీ కోసం విచ్చలవిడిగా జీఓలు ఇచ్చి ప్రజల సొత్తు దోచిపెట్టడం క్షమించరాని నేరం అరబిందో కంపెనీ ముసుగులో జరిగిన అరాచకాలపై విచారణ జరపాలని మా ప్రభుత్వాన్ని కోరుతున్నాను 108 అంబులెన్సుల నిర్వహణ విషయంలో గోల్డెన్ అవర్ పాటించడంలో విఫలమైన ఆ సంస్థపై హత్య కేసు నమోదు చేయాల్సిందే ఎంత మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారో తేల్చాలి. అంబులెన్సుల ట్రిప్పుల నమోదు విషయంలోనూ అక్రమాలు జరిగాయి ఐదేళ్లలో జరిగిన భారీ దోపిడీపై సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలి.