Sonali Bendre

Sonali Bendre: ‘డాక్టర్‌ని కాదు, నా అనుభవం మాత్రమే చెబుతున్నా’ — సోనాలి క్లారిటీ

Sonali Bendre: ఈ మధ్య బాలీవుడ్ నటి సోనాలి బింద్రే చేసిన కొన్ని వ్యాఖ్యలు అనుకోకుండా పెద్ద వివాదానికి దారితీశాయి. 2018లో మెటాస్టాటిక్ క్యాన్సర్‌తో పోరాడిన ఆమె, ఇటీవల ఒక కార్యక్రమంలో తన ఆరోగ్య ప్రయాణం గురించి మాట్లాడారు. ఆ సమయంలో ప్రకృతి వైద్యం కూడా తన కోలుకునే సమయంలో కొంత తోడ్పడిందని చెప్పింది. అయితే ఈ వ్యాఖ్యలను కొంతమంది వైద్యులు తప్పుగా అర్థం చేసుకుని విమర్శలు ప్రారంభించడంతో అంశం సోషల్ మీడియాలో వేడి చర్చగా మారింది.

సోనాలి క్యాన్సర్‌ వచ్చినప్పుడు అనుభవించిన బాధలు, ఆ సమయంలో ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి గురించి తరచూ మాట్లాడుతుంది. తన ప్రయాణం గురించి ప్రజలకు చెప్పడానికి ఏ దాచుకునేదిలేదని ఆమె ఎప్పుడూ చెబుతుంటుంది. కానీ ఈసారి ప్రకృతి వైద్యం గురించి చెప్పిన ఒక్క వ్యాఖ్య వైద్య సమాజం నుంచి తీవ్ర ప్రతిస్పందనకు దారి తీసింది. “ప్రకృతి వైద్యం క్యాన్సర్‌ను తగ్గిస్తుంది అని ఎక్కడా శాస్త్రీయ ఆధారాలు లేవు” అంటూ కొందరు వైద్యులు కఠినమైన వ్యాఖ్యలు చేశారు.

Also Read: Rahul Sipligunj Sangeet: సంగీత్ లో భార్యకు సర్ప్రైజ్ ఇచ్చిన రాహుల్..

ఈ విమర్శలు పెరగడంతో సోనాలి తన వ్యాఖ్యలను వివరించడానికి ముందుకు వచ్చింది. తాను ఎప్పుడూ డాక్టర్‌ని అని చెప్పలేదని, ఎవరికి తప్పు దారి చూపించే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేసింది. క్యాన్సర్‌ వచ్చినప్పుడు తాను అనుభవించిన బాధలు, తనకు ఉపశమనం ఇచ్చిన పద్ధతులు, తన మీద పని చేసిన చికిత్స గురించి మాత్రమే చెప్పానని వివరించింది. “నేను మోసగత్తెను కాదు. క్యాన్సర్‌తో నరకం అనుభవించిన వ్యక్తిని. నాకు పనిచేసిన పద్ధతులు మాత్రమే మీతో పంచుకున్నాను. అందరూ అదే చేయాలి అని నేను ఎప్పుడూ చెప్పలేదు” అని సోనాలి చెప్పింది.

అలాగే ప్రతి క్యాన్సర్‌ రకం వేరు, ప్రతి వ్యక్తికి చికిత్స కూడా వేరు అని మరోసారి గుర్తు చేసింది. ఎవరికేమి సరిపోతుందో వారు వైద్యుల సలహాతోనే నిర్ణయించుకోవాలని సూచించింది. తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే ఈ వివాదం వచ్చిందని ఆమె బాధ వ్యక్తం చేసింది. క్యాన్సర్‌తో పోరాడి తిరిగి నిలబడిన తర్వాత సోనాలి ఎప్పుడూ సాధికారత, ధైర్యం, ఆశ అనే సందేశాలను పంచుకునే వ్యక్తిగా మారింది. తన జీవన పోరాటం ఎంతోమందికి స్పూర్తినిచ్చేలా మారిన సంగతి తెలిసిందే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *