Sobhita Dhulipala: నాగ చైతన్య తండేల్ రిలీజ్ సందర్భంగా ఆయన సతీమణి శోభితా పెట్టిన ఇన్‌స్టా స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తండేల్ పోస్టర్ షేర్ చేసిన శోభితా తండేల్ సినిమా రిలీజ్‌పై సంతోషం వ్యక్తం చేస్తూ భర్తని పొగిడేసింది. ఇంతకి ఆమె చేసిన పోస్ట్ లో ఏముందంటే.. “నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సినిమా మేకింగ్ టైమ్ లో నువ్వు ఎంత ఫోకస్ గా పని చేసావో చూసాను. ఈ సినిమా పట్ల పాజిటివ్‌గా ఉండటం నేను చూశాను. ఈ అద్భుతమైన ప్రేమకథని అందరితోపాటు థియేటర్లో చూసేందుకు నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ‘ఫైనల్లీ గడ్డం షేవ్ చేస్తావు మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ” అని పోస్ట్ చేసింది శోభిత. దీనిపై నాగ చైతన్య స్పందిస్తూ.. ”థాంక్యూ బుజ్జితల్లి” అని పేర్కొంటూ పోస్ట్ చేసాడు. నాగ చైతన్య, శోభితల వివాహవేడుక సమయంలో కూడా చైతు ఫుల్ గడ్డంతోనే కనిపించాడు. మొత్తానికి తండేల్ ను ముగించి క్లీన్ షేవ్ లో దర్శనమిస్తున్నందుకు శోభిత దూళిపాళ్ల సంతోషం వ్యక్తం చేస్తూ చేసిన పోస్ట్ ని నెట్టింట అక్కినేని ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.
Beta feature