Tea With Cigarette

Tea With Cigarette: స్టైల్‌గా సిగరెట్ కాల్చుతూ టీ తాగుతున్నారా.. ఐతే జాగ్రత్త!

Tea With Cigarette: చాలామందికి పొగ తాగడం ఒక స్టైల్‌గా, టీ తాగడం ఒక రిఫ్రెష్‌మెంట్‌గా అనిపిస్తుంది. అయితే, ఈ రెండింటిని కలిపి తీసుకునే అలవాటు ప్రాణాలకే ప్రమాదమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొగ తాగే అలవాటు ఉన్న చాలామంది టీ తాగుతూ, దానితో పాటు సిగరెట్ కాల్చడానికి ఇష్టపడుతుంటారు. ఇది ఎంత ప్రమాదమో వారికి తెలియకపోవచ్చు. ఒక్క సిగరెట్, దాని పొగ ఊపిరితిత్తులు, గుండె, కాలేయం ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలిగిస్తాయి. గుండెపోటు వచ్చే అవకాశాన్ని పెంచుతాయి.

గుండెకు ముప్పు:
సాధారణంగా సిగరెట్ తాగడం వల్ల గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దీనివల్ల రక్త ప్రసరణ సరిగా జరగక గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

టీ, సిగరెట్‌ల ప్రమాదకర కాంబినేషన్:
కొన్ని అధ్యయనాల ప్రకారం, టీతో పాటు సిగరెట్ తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు 30% వరకు పెరుగుతాయి. టీలో ఉండే కొన్ని రకాల టాక్సిన్స్ సిగరెట్ పొగలోని హానికర రసాయనాలతో కలిసినప్పుడు క్యాన్సర్‌కు కారణమయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. సాధారణ టీ కంటే పాలు కలిపిన టీ మరింత ప్రమాదకరమని చెబుతున్నారు.

ఇతర ఆరోగ్య సమస్యలు:
ఈ ప్రమాదకర అలవాటు కేవలం గుండె, క్యాన్సర్‌కు మాత్రమే పరిమితం కాదు. ఇంకా చాలా ఆరోగ్య సమస్యలు దీనివల్ల వస్తాయి.

* సంతానలేమి సమస్యలు: ఈ రెండింటి కాంబినేషన్ పురుషులలో, మహిళలలో సంతానలేమి సమస్యలకు దారి తీయవచ్చు.

* జీర్ణ సమస్యలు: కడుపులో పుండ్లు, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు పెరుగుతాయి.

* ఊపిరితిత్తులు దెబ్బతినడం: సిగరెట్ పొగ వల్ల ఊపిరితిత్తులు కుంచించుకుపోయి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి.

* జ్ఞాపకశక్తి కోల్పోవడం: మెదడుపై కూడా ఈ అలవాటు ప్రభావం చూపుతుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి తగ్గి, బ్రెయిన్ స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  National High Ways: తెలంగాణ‌కు గుడ్‌న్యూస్‌.. 15 హైవేల‌కు మ‌హ‌ర్ద‌శ‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *