Earthquake

Earthquake: తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో భూకంపం..

Earthquake: తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భూమి కంపించింది .  ములుగు కేంద్రంగా భూప్రకంపనలు వచ్చాయి .  రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.3గా నమోదు అయింది .  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని, నాగులవంచ మండలాల్లో భూ ప్రకంపనలతో ప్రజలు భయాభ్రాంతులకు గురయ్యారు .  రంగారెడ్డి, హనుమకొండ, వరంగల్‌ జిల్లాల్లో కూడా భూప్రకంపనలు వచ్చాయి. విజయవాడ నగరం, జగ్గయ్యపేట పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది .  చాలా చోట్ల ఇళ్లు, అపార్టుమెంట్ల నుంచి ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. 

ఇంటిలో ఉన్నసామాను చెల్లాచెదురుకావడం . . గోడలు బీటలు వారడం కొన్ని చోట్ల జరిగింది. భూకంపం వలన పెద్ద నష్టం జరిగినట్టు వార్తలు లేనప్పటికీ చాలా జిల్లాల్లో భూకంప తీవ్రత ప్రజలను ఆందోళనకు గురిచేసింది .

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Tamilnadu: మాజీ గ‌వ‌ర్న‌ర్ ఇంట విషాదం.. సీనియ‌ర్ కాంగ్రెస్ నేత క‌న్నుమూత‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *