SLBC Praject:

SLBC Praject: కుప్ప‌కూలిన ఎస్ఎల్‌బీసీ సొరంగం.. లోప‌ల చిక్కుకున్న‌ కూలీలు

SLBC Praject: ఎస్ఎల్‌బీసీ (శ్రీశైలం ఎడ‌మ‌గ‌ట్టు కాలువ‌) సొరంగం పనుల్లో అప‌శ్రుతి చోటుచేసుకున్న‌ది. సొరంగం మార్గం వ‌ద్ద రిటెయిన్‌వాల్ ఒక్క‌సారిగా కుప్ప‌కూలింది. ఈ ఘ‌ట‌న‌లో సుమారు 10 మంది కూలీల‌కు గాయాల‌య్యాయి. ప‌నులు చేస్తున్న కొంద‌రు కూలీలు ట‌న్నెల్‌లో చిక్కుకున్న‌ట్టు తెలుస్తున్న‌ది. ప్ర‌స్తుతం ఘ‌ట‌నా స్థ‌లంలో స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.

SLBC Praject: ఐదు సంవ‌త్స‌రాల సుదీర్ఘ విరామం అనంత‌రం నాలుగు రోజు ల‌క్రితం ట‌న్నెల్‌లో ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. శ‌నివారం ఉద‌యం నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా దోమ‌ల‌పెంట స‌మీపంలో ఎడ‌మ‌వైపు సొరంగం 14వ కిలోమీట‌రు వ‌ద్ద ప‌నులు కొన‌సాగుతుండ‌గా, ఈ ప్ర‌మాదం చోటుచేసుకున్న‌ది. సొరంగ‌మార్గం వ‌ద్ద సుమారు 3 మీట‌ర్ల మేర పైక‌ప్పు కుంగింది. ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు ఆ ట‌న్నెల్‌లో 36 మంది దాకా ఉన్న‌ట్టు తెలుస్తున్న‌ది. ఆరుగురి ఆచూకీ తెలియాల్సి ఉన్న‌దని అధికారుల ద్వారా తెలిసింది.

SLBC Praject: న‌ల్ల‌గొండ జిల్లాకు సాగు, తాగునీరందించేందుకు శ్రీశైలం ఎడ‌మ‌గ‌ట్టు కాలువ సొరంగం ప్రాజెక్టును రూపొందించారు. శ్రీశైలం జ‌లాశ‌యం నుంచి న‌ల్ల‌గొండ జిల్లాకు 30 టీఎంసీల నీటిని త‌ర‌లించాల‌న్న‌ది ఈ ప్రాజెక్టు ల‌క్ష్యం. ఆగుతూ సాగుతూ వ‌స్తున్న ఈ ప్రాజెక్టు ప‌నుల‌ను ఇటీవ‌లే ప్రారంభించ‌డం గ‌మనార్హం.

SLBC Praject: శ్రీశైలం ఎడ‌మ‌గ‌ట్టు కాలువ సొరంగం ట‌న్నెల్ ప‌నుల్లో జ‌రిగిన ప్ర‌మాదం గురించి తెలిసిన సాగునీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి హుటాహుటిన బ‌య‌లుదేరి వెళ్తున్న‌ట్టు చెప్పారు. అధికారులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు, ట‌న్నెల్ లోప‌ల చిక్కుకున్న వారి వివ‌రాలు ఇంకా తెలియ‌డం లేదు అని మంత్రి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *