SLBC Praject: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంలో 16వ రోజైన ఆదివారం (మార్చి 9) కీలక విషయాన్ని పసిగట్టారు. గల్లంతైన వారిలో ఒకరి మృతదేహాన్ని గుర్తించారు. బురదలో నుంచి బయటకు వచ్చిన కుడి చేయి, ఎడమ కాలును గుర్తించారు. దీంతో ఇన్నిరోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ ఓ కొలిక్కి వచ్చినట్టయింది. టీబీఎం పరికరాలు, బురద, ఎడతెరిపిలేకుండా వస్తున్న నీటి ఊట కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌కు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో మృతదేహాల ఆచూకీని కనిపెట్టలేకపోయారు.
SLBC Praject: కేరళ నుంచి క్యాడవర్ జాగిలాలను రప్పించారు. చెన్నై నుంచి ఐఐటీ కళాశాల రోబోటిక్ పరిశోధకులు కూడా వచ్చి పరిశీలించారు. అయితే గతంలో రాడార్ సూచించిన ప్రదేశంలోనే క్యాడవర్ జాగిలాలు కూడా తవ్వినట్టు నిన్న సమాచారం వచ్చింది. టీబీపీ యంత్ర పరికరాలను కట్‌చేసి తొలగించగా, ఇంకా దాని శకలాలు ఉన్నాయి. అయితే ఆ టీబీఎం యంత్రం ముందు భాగంలోనే ఒకరి మృతదేహాన్ని తాజాగా రెస్క్యూ బృందాలు గుర్తించాయి.
SLBC Praject: రెస్క్యూ బృందాలు గుర్తించిన డెడ్‌బాడీ కుడి చేతికి కడియం ఉండటంతో ఇంజినీర్ గుర్‌ప్రీత్‌సింగ్ మృతదేహంగా భావిస్తున్నారు. దానిని బయటకు తీయడానికి కూడా టీబీఎం యంత్ర శకలాలు, బురద, నీరు అడ్డంకిగా మారాయి. సాయంత్రంలోగా గుర్‌ప్రీత్‌సింగ్ మృతదేహాన్ని బయటకు తీయోచ్చని భావిస్తున్నారు. అదే ప్రదేశంలో ఇతరుల మృతదేహాలు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సమీపంలోనైనా ఉంటారని, ఇక రెస్క్యూ ఆపరేషన్ కొలిక్కి వచ్చినట్టేనని అనుకుంటున్నారు.