Killer

Killer: సూర్య కిల్లర్ తో థ్రిల్ చేయనున్న రెహమాన్!

Killer: ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత దిగ్గజం ఎ.ఆర్. రెహమాన్ తన మాయాజాల స్వరాలతో మరోసారి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధమయ్యారు. ఈసారి, ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్.జె. సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కిల్లర్’ చిత్రంలో రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం శ్రీ గోకులం మూవీస్, ఏంజెల్ స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతోంది. పాన్-ఇండియా థ్రిల్లర్‌గా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఎస్.జె. సూర్య స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లు రాసి, నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రీతి అస్రానీ కీలక పాత్రలో కనిపించనుంది. సూర్య ఎంతో ఇష్టంతో రాసిన ఈ కథ ఎంతో ఉత్కంఠభరిత కథనంగా ఉంటుందని సమాచారం. మొత్తానికి రెహమాన్, సూర్య కలయికతో ‘కిల్లర్’ సినిమా భారతీయ సినిమా అభిమానులకు ఒక విజువల్ ట్రీట్‌గా నిలవనుంది. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *