Hyderabad: ఏమి చెప్పలేము. విధి రాత ..అంతే. అప్పటివరకు ఆనందంగా ఉన్న …ఆ చిణ్ణరి. క్షణంలో చనిపోయాడు. తప్పు ఎవరిదీ అంటే …ఇదిగో పలానా వ్యక్తిది అని అనలేము. తల రాత రాసిన ఆ దేవుడిని వేలు ఎత్తి చూపాలి తప్పా ..వేరే ఏది చేయలేము. కలల్లో కన్నీరు తెప్పించే ఈ దారుణం…ఓ అభం శుభం తెలియని పసి హృదయాన్ని బలి తీసుకుంది.
లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న బాలుడు అర్ణవ్ మృతి చెందాడు. ఈ విషయాన్ని వైద్యులు వెల్లడించారు. లిఫ్టు ప్రమాదంలో పొత్తి కడుపు నలిగిపోయినట్టుగా తెలిపారు. అలాగే, ఇంటర్నల్ బ్లీడింగ్ అయినట్టు వైద్యులు చెప్పారు. దీంతో బాలుడు మృతి చెందినట్లుగా వెల్లడించారు. పిల్లాడి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Also Read: Telangana: బిర్యానీ తిని హోటల్ సిబ్బందిపై దాడి చేసిన కస్టమర్
మాసబ్‌ట్యాంక్ శాంతినగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌లో అర్ణవ్ ఇరుక్కుపోయాడు. తన తాతతో కలిసి తన మేనత్త ఇంటికి వెళ్లాడు అర్ణవ్. తాత, మనవడు లగేజీతో లిఫ్టు వద్ద ఉండగా.. ముందుగా లోపలికి అర్ణవ్ వెళ్లాడు. బాలుడి తాత కొంత లగేజీని లిఫ్టులో పెట్టి.. మిగిలిన లగేజీని తెచ్చేందుకు బయటికి వెళ్లాడు. ఈ క్రమంలో అర్ణవ్ బటన్ నొక్కాడు. దీంతో క్షణాల్లో లిఫ్టు కదిలి పైకి వెళ్లింది. లిఫ్టు గ్రిల్స్ తెరిచే ఉండటంతో బాలుడు లిఫ్టు నుంచి దూకాడు.
దీంతో లిఫ్ట్- స్లాబ్‌ల మధ్య అర్ణవ్ ఇరుక్కుపోయాడు. దీంతో బాలుడి కేకలు విన్న అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బందికి, హైడ్రా డీఆర్‌ఎఫ్ బలగాలను పోలీసులు రప్పించారు. వెల్డింగ్ మిషన్‌ల సాయంతో దాదాపుగా నాలుగు గంటల పాటు శ్రమించి బాలుడ్ని బయటకు తీశారు. అప్పటికే అర్ణవ్ ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉంది. వెంటనే నీలోఫర్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ అర్ణవ్ కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచాడు. అర్ణవ్ మృతితో అతడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.