తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్, హీరోయిన్ సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘అమరన్’. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి రూపొందించారు. ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితాధారంగా ఈ సినిమాను తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కించారు. సాయి పల్లవి ముకుంద్ వరదరాజన్ భార్య ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో నటించింది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.
తెలుగు ట్రైలర్‌ను హీరో నాని సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసి, చిత్రం మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. దేశం కోసం చేసిన పోరాట సన్నివేశాలను ఈ ట్రైలర్‌లో చూపించారు. ఆ సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటున్నాయి. ఎమోషనల్ సీన్స్ ను కూడా ట్రైలర్‌లో చూపించారు. ఈ ట్రైలర్‌ను తమిళంలో కమల్ హాసన్, మలయాళంలో టోవినో థామస్, కన్నడలో శివరాజ్‌కుమార్, హిందీలో అమీర్ ఖాన్ విడుదల చేశారు.
మొత్తంగా ఈ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ప్రముఖ హీరో కమల్ హాసన్ నిర్మించిన ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. కాగా, ఈ సినిమా దీపావళిని పురస్కరించుకుని ఈ నెల 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.