Siva Karthikeyan

Siva Karthikeyan: పట్టాలెక్కిన శివ కార్తికేయన్ మూవీ!

Siva Karthikeyan: పలు అనుమానాలకు తెర దించుతూ హీరో శివ కార్తికేయన్, డైరెక్టర్ సుధా కొంగర సినిమా ప్రారంభమైంది. ఇది శివ కార్తికేయన్ కు ఇరవై ఐదవ చిత్రం కావడం విశేషం. డాన్ పిక్చర్స్ బ్యానర్ పై ఆకాశ్‌ భాస్కరన్ దీనిని నిర్మిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ గా కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఈ మూవీలో ‘జయం’ రవి, అథర్వ కీలక పాత్రలు పోషించబోతున్నారు. తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో ఇటీవల కీర్తి సురేశ్‌ నటించిన ‘రఘు తాత’ మూవీ వచ్చింది. ఈ సినిమా కథాంశం కూడా అదే తరహాలో ఉండబోతోందని తెలిసింది. విప్లవాత్మక భావాలుండే కళాశాల విద్యార్థిగా శివ కార్తికేయన్ నటించబోతున్నాడట. ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ‘అమరన్’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న శివ కార్తికేయన్ కు సుధా కొంగర సినిమా ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.

ఇది కూడా చదవండి: అనుష్క ‘ఘాటి’ రిలీజ్‌ ఎప్పుడంటే..?

Ghaati: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తర్వాత స్టార్ హీరోయిన్ అనుష్క నటిస్తున్న సినిమా ‘ఘాటీ’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్ పాన్ ఇండియా మూవీగా దీనిని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇటీవలే ఈ సినిమా గ్లింప్స్ సైతం విడుదలై… ‘ఘాటీ’పై అంచనాలను పెంచేసింది. ‘వేదం’ తర్వాత అనుష్క, క్రిష్ కాంబోలో వస్తున్న ఈ సినిమాకు నాగవెల్లి విద్యాసాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. వచ్చే యేడాది ఏప్రిల్ 18న తెలుగులో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో దీనిని రిలీజ్ చేస్తామని తెలిపారు. చింతకింద శ్రీనివాసరావు కథను అందించిన ఈ సినిమాకు సాయిమాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు.

Akhil Akkineni: అక్కినేని అఖిల్ సినిమాఎట్టకేలకు మొదలైంది. ‘ఏజెంట్’ మూవీ తర్వాత కాస్తంత విరామం తీసుకున్న అఖిల్ కథలు వింటూనే కాలం గడిపేశారు. త్వరలో పెళ్ళి పీటలు కూడా ఎక్కబోతున్న అఖిల్… ఇప్పుడు తిరిగి యాక్టింగ్ మోడ్ లోకి వచ్చేశారు. అఖిల్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ‘లెనిన్’ అనే సినిమాను ప్రారంభించింది. మురళీ కిషోర్ అబ్బూరు దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈయన కిరణ్ అబ్బవరంతో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ తీశాడు. దర్శకుడు చేపిన కథ నచ్చడంతో అఖిల్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే… శ్రీలీల అక్కినేని నాగచైతన్య తోనూ ఓ సినిమా చేయబోతోంది. దీనికి కార్తీక్ దండు దర్శకుడు. విశేషం ఏమంటే ఈ అన్నదమ్ములు ఇద్దరితో స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్లలో శ్రీలీల మూడో వ్యక్తి. గతంలో పూజా హెగ్డే, నిధి అగర్వాల్ ఇద్దరూ అటు చైతు తోనూ, ఇటు అఖిల్ తోనూ కలిసి నటించారు.

ALSO READ  Olympics 2028: లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ 2028 షెడ్యూల్ విడుదల

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *