lokesh kanagaraj: ప్రస్తుతం దక్షినాదిలో క్రేజ్ ఉన్న డైరెక్టర్స్ లో కోలీవుడ్ కి చెందిన లోకేష్ కనకరాజ్ కూడా ఒకరు. ఇప్పటి వరకూ లోకేష్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఐదు. అవి అన్నీ హిట్టే. తొలి చిత్రం ‘మానగరం’, ఆ తర్వాత వచ్చిన కార్తీ ‘ఖైదీ’, విజయ్ ‘మాస్టర్’, ‘లియో’, కమల్ హాసన్ ‘విక్రమ్’ సంచలన విజయాలను సాధించాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ తో ‘కూలి’ సినిమా చేస్తున్నాడు లోకేష్. ఇందులో నాగార్జున, ఉపేంద్ర, సౌబీన్ సాహిర్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ కనపించనున్నారు. ఇది కాకుండా తన సినిమాటిక్ యూనివర్స్ లో ‘విక్రమ్2, ఖైదీ2, లియో2’ వంటివి ప్లాన్ లో ఉన్నాయి. వీటికంటే ముందు శివకార్తికేయన్ తో ఓ సినిమా చేయబోతున్నాడట. స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉందని అంటున్నాడు. అటు చూస్తే శివకార్తికేయన్ నటించిన ‘అమరన్’ రిలీజ్ కి రెడీగా ఉంది. దీని తర్వాత మురుగదాస్ చిత్రం చేయనున్నాడు. ‘డాక్టర్, డాన్, ప్రిన్స్’ చిత్రాలతో తెలుగులోనూ అభిమానులను సంపాదించిన శివకార్తికేయన్ తో లోకేష్ చేయబోయే మూవీ ఎలా ఉంటుందో చూద్దాం.

