Sivakarthikeyan: తమిళ సినీ హీరో శివకార్తికేయన్ తన నటనతోనే కాదు, నిజ జీవితంలోనూ హీరోగా నిలుస్తున్నారు. ఏడేళ్ల క్రితం మరణించిన తమిళ రైతు నాయకుడు నెల్ జయరామన్ కుమారుడు శ్రీనివాసన్ చదువుకు ఆర్థిక సాయం చేస్తానని శివకార్తికేయన్ ఇచ్చిన మాటను ఇప్పటికీ నిలబెట్టుకుంటున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు ఐ.శరవణన్ తాజాగా వెల్లడించారు.
శివకార్తికేయన్ గత ఏడేళ్లుగా శ్రీనివాసన్ విద్యా ఖర్చులను భరిస్తూ, ప్రతి సంవత్సరం పరీక్షల సమయంలో ఫోన్ చేసి అతని పురోగతిని తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీనివాసన్ కోయంబత్తూర్‌లోని కర్పగం కాలేజీలో చదువుతున్నాడు. ఈ సాయాన్ని ఎలాంటి ప్రచారం లేకుండా చేయడం శివకార్తికేయన్ ఔన్నత్యాన్ని చాటుతోంది.
Also Read: Suriya 45: సూర్య 45 టైటిల్ రివీల్: ‘కరుప్పు’తో మాస్ ఎంటర్‌టైనర్ సిద్ధం!
Sivakarthikeyan: ఈ విషయం ఆలస్యంగా బయటకు రావడంతో నెటిజన్లు, అభిమానులు శివకార్తికేయన్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. “రీల్‌లోనే కాదు, రియల్‌లోనూ హీరో” అంటూ సోషల్ మీడియాలో కొనియాడుతున్నారు. తెలియకుండా ఇలాంటి సహాయాలు ఇంకెన్ని చేస్తున్నాడో అని అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు. శివకార్తికేయన్ నిజంగా సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
#SK – A Golden Heart 💛🙏#neljeyaraman #Sivakarthikeyan #VnrSKFC
✅ Follow us for more updates : @vnr_skfc#SK @Siva_Kartikeyan @mohandasspugal @AnandSkfc @navneth @AllIndiaSKFC @SKNIOfficial pic.twitter.com/j9jmH86LG2
— Viruthunagar SKFC (@VNR_SKFC) June 20, 2025

