AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మద్యం కుంభకోణం కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఈ కేసును విచారిస్తున్న సిట్ (Special Investigation Team) అధికారులు ఓ కీలక ఆధారాన్ని వెలికితీశారు.
సిట్ బృందం రాజ్ కెసిరెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు దాచిన రూ.11 కోట్లు నగదును పట్టుకుంది. ఈ డబ్బును 12 బాక్సుల్లో నింపి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలో ఉన్న సులోచన ఫామ్ గెస్ట్‌హౌస్‌లో దాచి ఉంచినట్లు వెల్లడైంది.
ఇది కూడా చదవండి: Gold Rate Today: దిగొచ్చిన బంగారం ధరలు.. కొనాలి అంటే ఇదే మంచి ఛాన్స్
ఈ తనిఖీలకు ప్రధాన ఆధారం ఏ-40 నిందితుడు వరుణ్ పురుషోత్తం వాంగ్మూలం. అతను చెప్పిన సమాచారంతోనే సిట్ అధికారులు తక్షణమే సోదాలు జరిపారు. అతనితో పాటు చాణక్య, వినయ్ పాత్రపైనా విచారణ కొనసాగుతోంది.
ఇక, ఈ డబ్బును 2024 జూన్‌లోనే అక్కడ భద్రపరిచినట్టు నిందితులు అంగీకరించారు. నగదు స్వాధీనం ఘటన ఈ కేసుకు మరో దిశగా మలుపు తిప్పింది. సిట్ బృందం ప్రస్తుతం మరిన్ని ఆధారాలను సేకరించేందుకు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టింది.