Mohammed Siraj: హైదరాబాద్ కు చెందిన భారత క్రికెట్ టీమ్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్, తన కెరీర్ ప్రారంభ రోజుల్లో బూట్లు కొనడానికి కూడా డబ్బు లేని కష్టాలను గుర్తుచేసుకున్నాడు. కుటుంబ అవసరాల కోసం ప్రతిరోజూ టెన్నిస్ బాల్ మ్యాచ్‌లు ఆడేవాడని భావోద్వేగంతో పంచుకున్నాడు. ఈ మాటలు అతను ‘నెక్స్ట్ సిరాజ్ ఎవరు?’ అనే ప్రోగ్రామ్‌లో చెప్పాడు. ఈ ఈవెంట్‌ను హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఎమ్మేస్కే ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ నిర్వహించింది.
యువ క్రికెట్ ప్రతిభలను గుర్తించడానికి నిరుపేద పిల్లలకు ఉచిత శిక్షణ అందించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో. ఫాస్ట్ బౌలింగ్ ట్రయల్స్‌ను ఆరంగళ్లోని విజయానంద్ గ్రౌండ్‌లో నిర్వహించారు.
ఈ ఈవెంట్‌లో బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మేస్కి ప్రసాద్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్, TNGO జనరల్ సెక్రటరీ ముజీబ్ హాజరయ్యారు. ఈ ట్రయల్స్‌లో దాదాపు 400 మంది యువ క్రికెట్‌ర్లు పాల్గొన్నారు.
Also Read: Cricket News: కోహ్లీ, రోహిత్ లపై ఫైర్ అయిన చీఫ్ సెలెక్టర్..! వారి వల్ల నష్టమే తప్ప లాభం లేదంటున్నాడు
సిరాజ్ ఈ సందర్భంగా, యువ క్రికెట్‌ర్లు ఈ ట్రయల్స్‌ను ఉపయోగించుకుని తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించాడు. MSK ప్రసాద్, ప్రతిభావంతులైన నిరుపేద పిల్లలను వెలుగులోకి తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని నిస్వార్థంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అసదుద్దీన్ ఒవైసీ తన బాల్యంలో క్రికెట్ ఆడిన రోజులను గుర్తుచేసుకుని, యువ క్రికెట్‌ర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చాడు.