Single: శ్రీవిష్ణు హీరోగా కార్తీక్ రాజు దర్శకత్వంలో వచ్చిన ‘సింగిల్’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇవానా, కేతిక శర్మ హీరోయిన్లుగా నటించిన ఈ ఫుల్ ఎంటర్టైనర్ 30 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. రెండో వీకెండ్‌లోనూ స్ట్రాంగ్ బుకింగ్స్‌తో దూసుకెళ్తోంది. గత 24 గంటల్లో దాదాపు 30 వేలకు పైగా టికెట్లు బుక్ కాగా, ఇక నుంచి కూడా ఇదే జోరు కొనసాగే అవకాశం ఉంది.
Also Read: Cinema Theatres: జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు బంద్
Single: విశాల్ చంద్రశేఖర్ సంగీతం, గీతా ఆర్ట్స్ సమర్పణలో విడుదలైన ఈ చిత్రం శ్రీవిష్ణు కెరీర్‌లో మరో సూపర్ హిట్‌గా నిలిచింది. యూత్‌ను ఆకట్టుకున్న స్టోరీ, కామెడీ టైమింగ్‌తో సినిమా బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది. శ్రీవిష్ణు నటనకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

