Singer Palak Muchhal

Singer Palak Muchhal: దాతృత్వంలో గిన్నిస్ రికార్డు కొట్టిన బాలీవుడ్ సింగర్!

Singer Palak Muchhal: బాలీవుడ్ గాయని పాలక్ ముచ్చల్ 3,800 మంది పిల్లల గుండె శస్త్రచికిత్సలకు నిధులు సమకూర్చి గిన్నిస్ రికార్డు సాధించింది. ఇండోర్‌కు చెందిన ఈ గాయని తన సంగీత ఆదాయాన్ని దాతృత్వంలో ఉపయోగిస్తోంది. లిమ్కా రికార్డుల్లోనూ ఆమె పేరు నమోదైంది.

Also Read: Samantha: సమంత కొత్త ఆధ్యాయం మొదలైంది.. ఇంకో బ్రాండ్ లాంచ్ చేసిన సామ్..

ఇండోర్‌కు చెందిన బాలీవుడ్ గాయని పాలక్ ముచ్చల్ గిన్నిస్, లిమ్కా రికార్డుల్లో స్థానం సంపాదించింది. 3,800 మంది నిరుపేద పిల్లల గుండె శస్త్రచికిత్సలకు నిధులు సమకూర్చిన ఘనత ఆమె సొంతమైంది. పాలక్ పలాష్ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమం నడుస్తోంది. చిన్నప్పుడు రైలు ప్రయాణంలో నిరుపేద పిల్లలను చూసి సహాయం చేయాలని ప్రతిజ్ఞ చేసింది. ఆ ప్రతిజ్ఞను నెరవేరుస్తూ ప్రతి కచేరీ ఆదాయం, వ్యక్తిగత పొదుపును శస్త్రచికిత్సలకు ఖర్చు చేస్తోంది. అదే సమయంలో కార్గిల్ అమరవీరుల కుటుంబాలకు సహాయం, గుజరాత్ భూకంప బాధితులకు రూ.10 లక్షల విరాళం అందించింది. ‘మేరీ ఆశికీ’, ‘కౌన్ తుఝే’, ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ వంటి హిట్ పాటలతో సంగీతరంగంలో గుర్తింపు పొందింది. ఈ విధంగా సంగీతం, దాతృత్వం రెండింటిలోనూ ఆమె అడుగుజాడలు చరిత్రాత్మకంగా నిలుస్తున్నాయి. పాలక్ భర్త బాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ మిథున్. ఆయన ఆషికి 2, ఏక్ విలన్, కబీర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు చార్ట్ బస్టర్ పాటలు అందించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *