Singer Kalpana: ప్రముఖ తెలుగు గాయని కల్పన ఆత్మహత్యాయత్నం చేసిన విషయం అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. హైదరాబాద్‌లోని నిజాంపేటలో తన నివాసంలో ఆమె ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. అపార్ట్‌మెంట్ నివాసితులు స్పందించి పోలీసులకు సమాచారం అందించడంతో, కేపీహెచ్‌బీ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. అపస్మారక స్థితిలో పడిఉన్న ఆమెను వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కల్పన భర్తను విచారణ కోసం అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించారు. ఆమె మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు ప్రాథమికంగా చేసుకున్న పరిశీలనలో ఆమె అధిక మోతాదులో నిద్ర మాత్రలు తీసుకున్నట్లు గుర్తించారు.
ఇది కూడా చదవండి: Salman Khan: సల్మాన్, అట్లీ సినిమాకు బ్రేక్.. ఆ కారణంతోనే ప్రాజెక్ట్ ఆగిపోయిందా.. ?
కల్పన హైదరాబాద్‌లో ఉండగా, ఆమె పెద్ద కుమార్తె కేరళలో ఉంటోంది. ఆత్మహత్యాయత్నానికి ముందు, కల్పన తన కుమార్తెను ఫోన్ చేసి హైదరాబాద్‌కు రావాలని కోరిందని, కానీ ఆమె తిరస్కరించిందని పోలీసులు గుర్తించారు. వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని సమాచారం. అదే ఒత్తిడిలో ఆమె టాబ్లెట్లు ఎక్కువ మోతాదులో తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మధ్యాహ్నం 3 గంటల సమయంలో కల్పన ఎక్కువ మందు మింగినట్లు తెలుస్తోంది. సాయంత్రం 4:30 గంటలకు భర్త ప్రసాద్ ఆమెను ఫోన్ చేసినా స్పందించలేదు. అపార్ట్‌మెంట్ సెక్రటరీ ద్వారా పరిస్థితిని తెలుసుకోవాలని భర్త ప్రయత్నించాడు. అపార్ట్‌మెంట్ నివాసితుల ఫిర్యాదుతో పోలీసులు చర్యలు తీసుకొని ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని, మరిన్ని వివరాలు ఆమె స్టేట్‌మెంట్ ఆధారంగా వెల్లడిస్తామని కేపీహెచ్‌బీ పోలీసులు తెలిపారు.