Miss You Promotion: నవంబర్ 29న విడుదల కావాల్సిన ‘మిస్ యు’ చిత్రం తమిళనాడులో భారీ వర్షాల కారణంగా జనం ముందుకు రాలేదు. అయితే… ఇప్పుడు మామూలు వాతావరణం ఏర్పడటంతో ఈ సినిమా విడుదలకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ 13న దీనిని రిలీజ్ చేయబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు. దాంతో మరోసారి తమ చిత్రం ప్రమోషన్స్ ను మొదలు పెట్టారు సిద్ధార్థ్, ఆషికా రంగనాథ్. ఈ సినిమాకు గిబ్రాన్ సంగీతం అందించాడు. ఎన్. రాజశేఖర్ దీనిని తెరకెక్కించాడు. దాదాపు పదేళ్ళ తర్వాత తాను నటించిన ప్రేమకథా చిత్రం ఇదని సిద్ధార్థ్ చెబుతున్నాడు. మరి యువతను దృష్టిలో పెట్టి తీసిన ‘మిస్ యు’ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
