Siddharth Kaushal: ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశల్ ఇటీవల సమర్పించిన రాజీనామాను కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. 2012 బ్యాచ్‌కు చెందిన కౌశల్ రెండు రాష్ట్రాల్లో సేవలందించారు. ఇటీవలే ఆయన తన వ్యక్తిగత కారణాలతో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోసం రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను కేంద్రం అధికారికంగా ఆమోదిస్తూ తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. ఇదిలా ఉండగా, ఆయన తీసుకున్న నిర్ణయం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సిద్ధార్థ కౌశల్ రాజీనామా 2025 జూన్ 30 నుంచి అమలులోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ నోటిఫికేషన్ జారీ చేశారు.
