Shubman Gill: జూలై 2025కు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ (Player of the Month – POTM) అవార్డును భారత కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ గెలుచుకుని చరిత్ర సృష్టించాడు. ఈ అవార్డును నాలుగు సార్లు గెలుచుకున్న తొలి పురుష క్రికెటర్‌గా నిలిచి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. గతంలో 2023 జనవరి, సెప్టెంబర్, అలాగే 2025 ఫిబ్రవరి నెలల్లో కూడా గిల్ ఈ అవార్డును అందుకున్నాడు.
ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో కెప్టెన్‌గా గిల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆ సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. జూలై నెలలో ఆడిన మూడు టెస్టుల్లో 94.50 సగటుతో 567 పరుగులు చేసి, ఒక డబుల్ సెంచరీ, రెండు సెంచరీలను సాధించాడు. ఈ అద్భుతమైన ప్రదర్శన కారణంగా అతనికి ఈ అవార్డు దక్కింది.
Also Read: Dewald Brevis: బంతుల్లోనే సెంచరీ.. చరిత్ర సృష్టించిన డెవాల్డ్ బ్రెవిస్
ఈ అవార్డు గెలుచుకోవడం ద్వారా గిల్, ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ వియాన్ ముల్డర్లను అధిగమించాడు. గతంలో మహిళా క్రికెటర్లైన ఆష్ గార్డ్‌నర్ (ఆస్ట్రేలియా),హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్) మాత్రమే నాలుగు సార్లు ఈ అవార్డును గెలుచుకున్నారు. పురుషుల విభాగంలో మాత్రం ఈ రికార్డును నెలకొల్పిన మొదటి ఆటగాడు గిల్ కావడం విశేషం.
ఇంగ్లాండ్‌తో జరిగిన 5 టెస్టుల సిరీస్‌లో కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించి ఈ అవార్డు గెలుచుకున్నాడు. ఈ సిరీస్‌లో మొత్తం 754 పరుగులు చేసి, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. ముఖ్యంగా, జూలై నెలలో ఆడిన 3 టెస్టుల్లో 94.50 సగటుతో 567 పరుగులు చేశాడు. ఇందులో బర్మింగ్‌హామ్‌లో ఒక డబుల్ సెంచరీ (269), ఒక సెంచరీ (161), అలాగే మాంచెస్టర్‌లో ఒక సెంచరీ (103) ఉన్నాయి. కెప్టెన్‌గా అతని తొలి సిరీస్‌లోనే ఈ ఘనత సాధించడం విశేషం.