ఇటీవలే సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న హీరోయిన్ శృతిహాసన్… సెకండ్ ఇన్నింగ్స్‌లో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో దూసుకుపోతుంది. ప్రస్తుతం రజినీకాంత్ చిత్రం కూలీ సినిమాలో నటిస్తోంది. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇవే కాకుండా మరో రెండు సినిమాలకు ఓకే చెప్పింది శృతి. అందులో టాలీవుడ్ హీరో అడివి శేష్ నటిస్తోన్న డెకాయిట్:ఎ లవ్ స్టోరీ ఒకటి. మరొకటి చెన్నై స్టోరీ.
అయితే ఈ రెండు సినిమాల నుంచి శృతిహాసన్ తప్పుకున్నట్లు లేటేస్ట్ టాక్. చిత్ర యూనిట్ మధ్య వచ్చిన కొన్ని విభేదాల కారణంగానే ఆమె గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె సన్నిహితుల్లో ఒకరు మీడియాకు వెల్లడించారు. డెకాయిట్‌తో పాటు చెన్నై స్టోరీ కూడా చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే డేట్స్ సర్దుబాటుతో పాటు ఆమె రెమ్యునరేషన్ వల్ల ఈ రెండు ప్రాజెక్ట్స్ నుంచి స్వయంగా తప్పుకుందని సమాచారం.
లేడీ ఒరియంటెడ్‌గా తెరకెక్కబోతోన్న చెన్నై స్టోరీలో మొదటి లీడ్ రోల్ కోసం సమంతను అనుకున్నారు. అంతేకాదు దీనిపై ప్రకటన కూడా వచ్చింది. అయితే.. అనారోగ్యం వల్ల సమంత ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో సామ్ స్థానంలో శృతిహాసన్ తీసుకున్నారు. కొంతభాగంగా షూటింగ్ కూడా జరిగిందట. ఇప్పుడు శృతిహాసన్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకోవడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. కాగా.. గతేడాది డిసెంబర్‌లో అడివి శేష్, శృతి హాసన్ జంటగా డెకాయిట్ మూవీని ప్రకటించారు. టీజర్‌ను కూడా విడుదల చేశారు.