Shruti Haasan

Shruti Haasan: డాకాయిట్‌ను మిస్ చేసుకోవడం శృతి హాసన్ చేసిన తప్ప..?

Shruti Haasan: డెకాయిట్ సినిమా మిస్ చేసుకొని తప్పు పని చేసిందా శృతి హాసన్? దీనికి ‘అవును’ అనే సమాధానమే వినిపిస్తుంది. బలమైన, క్యారెక్టర్ డెప్త్ ఉన్న పాత్రల కోసం చూస్తున్న శృతి హాసన్ కి డెకాయిట్ ఓ మంచి అవకాశం అయ్యుండేది. ఇప్పుడు మృణాల్ ఠాకూర్ కి వస్తున్న ప్రశంసలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది.

డెకాయిట్ సినిమాలో మృణాల్ ఠాకూర్ క్యారెక్టర్ చుట్టూతే కథ తిరుగుతూ ఉంటుంది. అలాగే యాక్టింగ్ చేయడానికి కూడా చాలానే స్కోప్ ఉంది. సీతారామం, హాయ్ నాన్న సినిమాలలో గుర్తుండిపోయే పాత్రలు చేసిన ఆమె, ఈ సినిమాలో తన కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారనే చెప్పొచ్చు.

ముందు ఈ సినిమాలో శృతి హాసన్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు కూడా తీశారు, కానీ ఎందుకో తెలియదు గానీ సినిమా నుండి బయటికి వచ్చేసింది. లేకుంటే మృణాల్ కి వస్తున్న ఈ ప్రశంసలన్నీ శృతికి వచ్చేవి.

కూలీ తర్వాత కనిపించని శృతి, క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉన్న కథలు మాత్రమే ఎంచుకుంటుంది. అందుకే సినిమాలు చేయడం తగ్గించింది. డెకాయిట్ సినిమా రిలీజ్ అయిన ప్రతిచోటా పాజిటివ్ టాక్ వస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *