Shruti Haasan: నటి శృతి హాసన్ తన అందం, వ్యక్తిగత ఎంపికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీనేజ్‌లో ముక్కు రూపం నచ్చక ప్లాస్టిక్ సర్జరీ చేయించినట్లు బహిరంగంగా వెల్లడించారు. ముఖ సౌందర్యం కోసం ఫిల్లర్స్ వాడినట్లు కూడా ఒప్పుకున్న శృతి, ఈ నిర్ణయాలను దాచడం తనకు అవసరం లేదని స్పష్టం చేశారు. తన శరీరంపై తీసుకునే నిర్ణయాలు పూర్తిగా తన స్వేచ్ఛ అని, ఇతరుల ఎంపికలను గౌరవిస్తానని పేర్కొన్నారు.
Also Read: Sathi Leelavathi: ఆకట్టుకుంటున్న లావణ్య త్రిపాఠి సతీ లీలావతి ఫస్ట్ లుక్!
Shruti Haasan: వయసు పెరిగితే భవిష్యత్తులో ఫేస్ లిఫ్ట్ చేయించుకోవడానికి కూడా సిద్ధమని ధైర్యంగా చెప్పారు. తన ఎంపికలను ఎవరూ ప్రశ్నించాల్సిన అవసరం లేదని శృతి గట్టిగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ‘కూలీ’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం శృతి వ్యాఖ్యలు సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.