Shruti Haasan

Shruti Haasan: ప్రముఖ బ్రాండ్ అంబాసిడర్‌గా శృతి హాసన్ జోరు!

Shruti Haasan: చెన్నైలో రియల్ ఎస్టేట్ రంగంలో దిగ్గజంగా వెలుగొందుతున్న రాజ్‌పారిస్ సంస్థ తమ 2030 లక్ష్యంగా 500 కోట్ల ఆదాయాన్ని సాధించాలని భావిస్తోంది. ఈ క్రమంలో కొత్త బ్రాండ్ ఐడెంటిటీతో పాటు, ఈస్ట్ కోస్ట్ రోడ్‌లోని ముత్తుకాడులో 55 లగ్జరీ అపార్ట్‌మెంట్లతో బ్లూ జ్యువెల్ ప్రాజెక్ట్‌ను ఆవిష్కరించింది. ఈ 3 బిహెచ్‌కె రెసిడెన్స్‌లు 2200 చదరపు అడుగుల విస్తీర్ణంతో, బే ఆఫ్ బెంగాల్, ముత్తుకాడు సరస్సు, బకింగ్‌హామ్ కాలువల సమ్మిళిత దృశ్యాలను అందిస్తాయి.

Also Read: Toxic: టాక్సిక్ నో బాడీ డబుల్స్.. క్రూరమైన ఫైట్స్‌?

ఈ ప్రాజెక్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నటి శ్రుతి హాసన్‌ను ఎంపిక చేశారు. శ్రుతి మాట్లాడుతూ, రాజ్‌పారిస్ నాణ్యత, విశ్వసనీయత తనకు నచ్చాయని, ఈ సహకారం తన విలువలతో సమానంగా ఉందని చెప్పారు. రాజ్‌పారిస్ డైరెక్టర్ రాజ్‌కుమార్ సచ్చిదానందం మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ తమ సంస్థకు కీలక మైలురాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *