Shreyas Iyer

Shreyas Iyer: అంత బాగా ఆడే శ్రేయస్ అయ్యర్ కు జట్టులో చోటు లేదా? పాంటింగ్ అనవసర వ్యాఖ్యలు..!

Shreyas Iyer: ఇండియన్ క్రికెట్ జట్టులో శ్రేయస్ అయ్యర్‌కు స్థిరమైన స్థానం లేకపోవడం విషయంలో ఆశ్చర్యం కలిగిందని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ అన్నాడు. ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో అనివార్యంగా తుది జట్టులో చోటు దక్కించుకున్న శ్రేయస్ అయ్యర్ 36 బంతుల్లో 59 పరుగులు చేసి అసాధారణ బ్యాటింగ్‌తో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, విరాట్ కోహ్లీ గాయపడటంతోనే తనకు ఈ మ్యాచ్‌లో అవకాశం వచ్చిందని మ్యాచ్ తర్వాత శ్రేయస్ అయ్యర్ చెప్పాడు. దీనిపై పాంటింగ్ ఈ విధంగా స్పందించాడు..

భారత జట్టులో శ్రేయస్ అయ్యర్‌కు స్థిరమైన స్థానం లేకపోవడం ఆశ్చర్యమే అని పాంటింగ్ అన్నాడు. అతను 2023 వన్డే ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు మరియు మిడిల్ ఆర్డర్‌లో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడని భావించాడు. అతనికి గాయమై జట్టుకు దూరమైనప్పటికీ, దేశవాళీ క్రికెట్‌లో మంచి ప్రదర్శన చేశాడు, దాంతో తుది జట్టులో చోటు ఖాయమైనదిగా అనిపించింది అని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

తనకు జట్టులో చోటు లేదని తెలుసుకుని సినిమా చూస్తున్నప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ ఫోన్ చేసి ఆడటానికి అవకాశం ఉన్నాయని తెలియజేశాడని, దాంతో సినిమా ఆపేసి పడుకున్నానని అయ్యర్ వెల్లడించాడు. ఈ వ్యాఖ్యలపై ప్రతిస్పందించిన పాంటింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. శ్రేయస్ అయ్యర్ భారత జట్టులో అత్యంత ముఖ్యమైన ఆటగాడు అని తెలిపాడు.

ఇది కూడా చదవండి: BCCI: భారత ప్లేయర్లను డైమండ్ రింగ్స్ తో సత్కరించిన బిసిసిఐ..!

అయితే, అయ్యర్ వ్యాఖ్యలు పాంటింగ్‌ను షాక్ చేశాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ భారత జట్టుకు కీలకమైన ఆటగాడిగా ఉంటాడని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. నెమ్మదైన వికెట్లపై మరియు స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొనే విషయంలో అతను అద్భుతంగా ఆడుతాడని చెప్పాడు.

పాంటింగ్ ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ కోచ్‌గా ఉండనున్నాడు. ఐపీఎల్ 2024 తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పించబడి, పంజాబ్‌కు వెళ్లాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో శ్రేయస్ అయ్యర్‌ను రూ. 26.75 కోట్లకు పాంటింగ్ కొనుగోలు చేసి అతనికి సారథ్య బాధ్యతలు అప్పగించాడు.

అయితే పాంటింగ్ ఇక్కడ అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే… శ్రేయస్ అయర్ స్థానంలో కోహ్లీ జట్టులో ఆడడు. అయ్యర్ నాలుగవ స్థానం అతనికే పరిమితం అవుతుంది. కేవలం జైస్వాల్ స్థానంలో శుభ మన్ గిల్ రోహిత్ శర్మతో పాటు ఓపెనర్ గా జట్టులోనికి వస్తాడు. కాబట్టి జైస్వాల్ పక్కన కూర్చొని ఛాంపియన్స్ ట్రోఫీ తుది జట్టులో అయ్యర్ తన స్థానాన్ని నిలబెట్టుకుంటాడు.

మొదటి వన్డేలో హర్షిత్ రానా ఆడినంత మాత్రాన అర్షదీప్ లేదా బుమ్రా స్థానంలో అతను ఛాంపియన్స్ ట్రోఫీ తుది జట్టులో ఉంటాడని కాదు. ఇంగ్లాండ్ సిరీస్ లో భారత్ తమ బ్యాక్ అప్ ప్లేయర్లను పరీక్షించాలని చూస్తోంది. అందుకే అయ్యర్, అర్షదీప్ వంటి ఆటగాలను మొదటి మ్యాచ్ కు బెంజ్ కు పరిమితం చేయాలని నిర్ణయించుకుంది. అంతేకానీ ఈ సిరీస్ లో ఆడిన వారే అక్కడ కూడా ఆడతారు అనుకుంటే అంతకంటే అవివేకం ఉండదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *