Shraddha Kapoor

Shraddha Kapoor: సంచలన బయోపిక్ చేస్తున్న శ్రద్ధా కపూర్!

Shraddha Kapoor: బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్‌ మరో విశిష్టమైన చిత్రానికి సిద్ధమవుతున్నారు. మహారాష్ట్ర జానపద కళల ప్రతీకగా నిలిచిన లావణి, తమాషా నృత్యరంగంలో అపూర్వమైన కీర్తి తెచ్చుకున్న విఠాబాయ్ నారాయణగావ్కర్‌ జీవితగాథను పెద్ద తెరపై ఆవిష్కరించబోతున్నారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ బయోపిక్‌ను దినేష్ విజన్ నిర్మాణ సంస్థ మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ‘విఠ్ఠా’ అనే శీర్షికతో తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది.

విఠాబాయ్ తన కృషి, ప్రతిభతో ‘తమాషా క్వీన్’గా పేరు గడించారు. ఆమె జీవితంలోని కష్టాలు, పోరాటాలు, విజయాలు అన్నింటినీ ఈ చిత్రం ప్రతిబింబించనుంది. యోగిరాజ్ బాగుల్ రచించిన తమాషా: విఠాబాయిచ్య ఆయుష్యాచా పుస్తకం ఆధారంగా ఈ కథను తెరపైకి తీసుకురావడానికి చిత్రబృందం విఠాబాయ్ కుటుంబం నుంచి లైఫ్ రైట్స్ కూడా పొందింది.

Also Read: Kalki-2: 3 సంవత్సరాల తర్వాతే కల్కి 2.. క్లారిటీ ఇచ్చిన నాగ్ అశ్విన్

సంగీత రంగంలో అజయ్-అతుల్ ప్రత్యేకంగా పనిచేయబోతున్నారు. ఇక శ్రద్ధా కపూర్‌ ఈ పాత్రను నిజంగా ప్రతిబింబించేందుకు లావణి నృత్యంలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. ఈ సినిమా కేవలం బయోపిక్ మాత్రమే కాకుండా, భారతీయ జానపద కళల వైభవాన్ని, మరాఠీ సంస్కృతిని విశ్వవ్యాప్తంగా పరిచయం చేయనుంది. శ్రద్ధా కెరీర్‌లో ఇది మరో మైలురాయి అవుతుందన్న అంచనాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Niharika Konidela: కుర్రకారులో కాకరేపిన నిహారిక సాంగ్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *