shilpa shetty

Shilpa Shetty: గుడిలో ఉన్న శిల్పాశెట్టి ఫోటోలు వైరల్.. అధికారులకు షోకాజ్ నోటీసులు!

Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఫోటో వైరల్ కావడంతో వివాదం నెలకొంది. ఒడిశాలోని భువనేశ్వర్‌లోని లింగరాజ్ ఆలయాన్ని శిల్పా శెట్టి సందర్సించారు. ఈ సమయంలో  ఆలయంలో తీసుకున్న ఫొటోలు,  వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో ఆలయ నిర్వాహకులు ఒక సేవదార్,  అధికారికి షోకాజ్ నోటీసులు  జారీ చేశారు. నిజానికి ఇక్కడ ఆలయం లోపల ఫోటోలు తీయడానికి ఆంక్షలు ఉన్నాయి. కానీ శిల్ప శెట్టి  ఆలయానికి వెళ్ళినప్పుడు, ఆమె ఫోటోలు తీశారు. 

ఇది కూడా చదవండి: Naga Chaitanya Marriage Date: చైతు, శోభిత పెళ్ళి డేట్ ఫిక్స్!

Shilpa Shetty: ఈ ఫొటోలు బయటకు రావడంతో భక్తుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆ తర్వాత ఆలయ పాలకవర్గం ఈ చర్య తీసుకుంది. ఆలయ ప్రాంగణంలో ఫోటోగ్రాఫ్‌లు, వీడియోలను అనుమతించనప్పుడు, నటి శిల్పాశెట్టి ఫోటోగ్రాఫ్‌లు తీయడానికి, వీడియోలు చేయడానికి ఎలా అనుమతించారని అధికారులను ప్రశ్నిస్తున్నారు  గత సోమవారం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు శిల్పాశెట్టి వచ్చినట్లు సమాచారం. ఈ సమయంలో, ఆమె సాయంత్రం లింగరాజు ఆలయాన్ని సందర్శించడానికి వెళ్ళింది. ఆ తరువాత ఆమె ఆలయంలో ఉన్న ఫోటోలు బయట పడి వైరల్ గా మారాయి. దీంతో ఆలయంలో కలకలం రేగింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *