Akhanda 2

Akhanda 2: శరవేగంగా అఖండ 2 షూటింగ్.. గ్రాఫిక్స్ పనులు స్టార్ట్!

Akhanda 2: నందమూరి నటసింహం బాలకృష్ణ రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం “డాకు మహారాజ్” ఇపుడు ఓటిటిలో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య తన సాలిడ్ ప్రాజెక్ట్ “అఖండ 2” స్టార్ట్ చేశారు. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read: SS Rajamouli: వివాదంలో టాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి

ఈ సినిమా షూటింగ్ ఒకపక్క ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది. అయితే ఒక్క షూటింగ్ మాత్రమే కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో కూడా చేసేస్తున్నారట. ఇప్పటికే అఖండ 2 లో ఇంటర్వెల్ ఎపిసోడ్ తాలూకా గ్రాఫిక్స్ పనులు స్టార్ట్ చేసేసారట. ఇలా షూటింగ్ తో పాటు ఈ పనులు కూడా జెస్ట్ స్పీడ్ లో జరిగిపోతున్నాయని చెప్పాలి. ఇక ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ వారు నిర్మిస్తున్నారు.

Akhanda 2 – Thaandavam 🔱 Title Theme :

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Vicky Kaushal: కబీర్ ఖాన్ దర్శకత్వంలో విక్కీ కౌశల్!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *