Viral Video: పెరుగుతున్న టెక్నాలజీ కలం లో మనం సోషల్ మీడియా ప్రతి రోజు ఏదో ఒకటి చూస్తుంటాం. ఇపుడు అలాంటిదే ఒక కొత్త వింత వెలుగులోకి వస్తోంది. అయితే ఈసారి జంతువులపై వింత జరిగింది. బల్లి తోకనుండి మంటలు రావడం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అవును.. వినడానికి విచిత్రంగానే ఉన్నా ఇది నిజమే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
వెనకబడి ఉన్న ఆసక్తికర కథ
కాంబోడియాకు చెందిన ఓ వ్యక్తి తన ఇంటి వెనక పెరట్లో లో పనులు చేసుకుంటూ ఉండగా గోడపై పాకుతున్న ఓ బల్లిని గమనించాడు. మొదట సాధారణంగానే అనుకున్నాడు. కానీ కాసేపటికి ఆ బల్లి తోక నుంచి టార్చ్‌లైట్‌లా లైటింగ్ రావడం అతడి దృష్టిని ఆకర్షించింది. వెంటనే తన సెల్‌ఫోన్ తీసి వీడియో తీశాడు.
ఆ బల్లి ఎటు తిరిగినా దాని తోక చివర ఎలక్ట్రిక్ స్పార్క్‌లా మంటలు చెలరేగుతున్నాయి. గోడపై పాకుతూ తోకను కదిలించగానే మంటలు రావడం స్పష్టంగా కనిపించింది.
ఇది కూడా చదవండి: Viral Video: వరద నీటిలో లైవ్‌లో మాట్లాడుతున్న జర్నలిస్ట్.. చూస్తుండగానే..
నెటిజన్ల స్పందన
ఆ వ్యక్తి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే కాసేపటిలోనే వైరల్ అయిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
-
“ఓరి దేవుడా.. ఇలాంటి బల్లిని ఎప్పుడూ చూడలేదు!” అని కొందరు ఆశ్చర్యపోతే,
-
“జాగ్రత్తగా ఉండు గురూ.. ఆ స్పార్క్ వల్ల ఇల్లు దగ్ధం అయ్యే అవకాశం ఉంది” అంటూ మరికొందరు హెచ్చరిస్తున్నారు.
ఇంకా కొందరేమో ఈ బల్లిని పోకీమాన్‌లోని ‘చార్మండర్’ లాంటి వింత జీవిగా పోలుస్తున్నారు.
అరుదైన వింత
ప్రతిరోజు సోషల్ మీడియాలో జంతువులపై వింత వీడియోలు వస్తుంటాయి. అయితే బల్లి తోకనుండి ఇలా మంటలు రావడం నిజంగా అరుదైన విషయం. ఇది నిజంగానే సహజసిద్ధమా? లేక ఏదైనా బయటి కారణం వల్ల జరిగిందా? అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
A man in Cambodia films a strange lizard seemingly sparking fire from its tail. Nature or trick? pic.twitter.com/E2ce7iXkTS
— ViralRush ⚡ (@tweetciiiim) July 19, 2025