Saiyaraa: బాలీవుడ్ బ్లాక్బస్టర్ సైయారా థియేటర్లలో దుమ్మురేపుతోంది. దేశావ్యాప్తంగా ఈ సినిమాకి మంచి ఆదరణ వస్తుంది. సోషల్ మీడియాలో ఈ సినిమా టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఇప్పుడు ఈ సినిమా ఓటిటి రిలీజ్పై హాట్ బజ్ వినిపిస్తోంది. త్వరలో స్ట్రీమింగ్కి రానుందని టాక్. అయితే ఓ షాకింగ్ ట్విస్ట్ నెలకొంది.
Also Read: Vijay Sethupathi: క్యాస్టింగ్కౌచ్ ఆరోపణలపై విజయ్ రియాక్షన్ ఏంటంటే?
సైయారా సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఆహాన్ పాండే హీరోగా అనిత్ పడ్డా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ చిత్రం 400 కోట్ల కలెక్షన్ల మైలురాయిని అందుకుంది. ఇండియన్ సినిమాలో డెబ్యూ హీరోకి ఇంతటి విజయం రేర్. ఇప్పుడు ఓటిటి రిలీజ్పై కీలక అప్డేట్ బయటికొచ్చింది. సెప్టెంబర్ 12 నుంచి నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుందని ఇన్సైడ్ టాక్. అయితే ఓన్లీ హిందీ వెర్షన్లో మాత్రమే అందుబాటులో ఉంటుందట. అధికారిక కన్ఫర్మేషన్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.